Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్KTR reaction on Kavitha arrest: చట్టబద్ధంగా పోరాడతాం

KTR reaction on Kavitha arrest: చట్టబద్ధంగా పోరాడతాం

ఇదంతా కక్షసాధింపు చర్యల్లో భాగం

ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ పదేళ్ల బిజెపి పాలనలో రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం చేయడం సర్వసాధారణంగా మారింది. ఈరోజు ఈడి ప్రదర్శించిన తొందరపాటు దుందుడుకు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కవిత అరెస్టు విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈడి వ్యవహరించిన తీరుపైన రేపు సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కచ్చితంగా 19వ తేదీన జరిగే సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోకి వస్తుందని ఆశిస్తున్నా. ఈడి స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్) ను తుంగలో తొక్కి ఈరోజు అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది, చట్టబద్ధంగా ఈ అంశంలో పోరాటం కొనసాగిస్తాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News