Saturday, November 15, 2025
Homeపాలిటిక్స్KTR: కాంగ్రెస్ కు భయపడం

KTR: కాంగ్రెస్ కు భయపడం

పార్టీ లీగల్ సెల్ అంతా చూసుకుంటుంది

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోందని నిప్పులు చెరిగారు వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు. వరంగల్ లోక్ సభ నియోజక వర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న కేసులకు భయపడేది లేదని తెగేసి చెప్పారు.

- Advertisement -

బీఆర్ఎస్ కు పటిష్టమైన లీగల్ సెల్ ఉందని, తప్పుడు కేసుల బాధితులకు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకుని పోరాడాలన్నారు. ఒక బీఆర్ఎస్ ఎంపీపీపై కేసు పెడితే మిగతా బీఆర్ఎస్ ఎంపీపీలందరూ స్పందించాలన్నారు కేటీఆర్. ఎక్కడికక్కడ సమష్టిగా తప్పుడు కేసులపై నాయకులు సమష్టిగా స్పందించాలని పిలుపునిచ్చారు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం స్పందిస్తుందని కేటీఆర్ వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad