పిల్లలకు పరీక్షలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తమకు ఎన్నికలటే అలాగే ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమాజిగూడలోని ది పార్క్ హోటల్ తెలంగాణ ఇండస్ట్రీలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఇంటరెక్టీవ్ మీటింగ్ కి హాజరైన మంత్రి కేటీఆర్..తాను ఈ భేటీకి పూర్తి రాజకీయ నాయకుడుగానే వచ్చినట్టు వెల్లడించారు. మీ మద్దతు కోసం పారిశ్రామికవేత్తలాగా కాకుండా ఒక్క పౌరిడిగా ఆలోచన చేయండి అంటూ ఆకట్టుకునేలా ప్రసంగించారు.
మీరు చూసింది ట్రైలర్ మాత్రేమే ఇంకా చాలా ఉందంటూ కేటీఆర్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకి పరిశ్రమల వస్తున్నాయ్ అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం వలనేనని, ప్రభుత్వం స్థిరత్వం లేకపోతే ముందుగా దెబ్బ తినేది పరిశ్రమలేనన్నారు. అధికారంలోకి వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఢిల్లీకి వెళ్లి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళని ఒప్పించాలి.. అవినీతి లేకుండా తమ ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సహం అందించిందన్నారు.