Thursday, April 10, 2025
Homeపాలిటిక్స్KTR says Revanth will be New Eknath Shinde of Cong: కాంగ్రెస్ ఏక్నాథ్...

KTR says Revanth will be New Eknath Shinde of Cong: కాంగ్రెస్ ఏక్నాథ్ షిండే రేవంత్

రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఇంజిన్ గా మారిండు

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేలా తయారవుతాడని కేటీఆర్ జోస్యం చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో ప్రసంగించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను వేల మందిని బీఆర్ఎస్ పార్టీ చూసిందని, మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలా మంది నీలీగిన్రని కేటీఆర్ కామెంట్ చేశారు.

- Advertisement -

కాంగ్రెస్ బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయని, రేవంత్ రక్తం అంత బిజెపిదే…ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండన్నారు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నాడని ఆరోపించారు. స్విట్జర్లాండ్ లో రేవంత్ రెడ్డి అదానితో అలైబలై చేసుకున్నాడని, అదాని రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు, లోగుట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండని, ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని పిలుపునిచ్చారు. బిజెపితో బీఆర్ఎస్ కు ఏరోజు పొత్తు లేదు.. భవిష్యత్తులోనూ ఉండదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News