Tuesday, September 10, 2024
Homeపాలిటిక్స్KTR wishes CM Revanth team: సీఎం రేవంత్ టీంకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

KTR wishes CM Revanth team: సీఎం రేవంత్ టీంకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రతినిధి బృందానికి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

- Advertisement -

పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా తో పాటు దక్షిణ కొరియాలో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో భారీ ప్రతినిధి బృందం పెట్టుబడుల కోసం బయలుదేరిన నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

గత పది సంవత్సరాలలో ఉత్తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక మల్టీ నేషనల్ కంపెనీలు ప్రపంచ దిగ్గజ సంస్థలను హైదరాబాద్ కి తీసుకు రాగలిగామని, ఈ సందర్భంగా ఆయా కంపెనీలతో తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఏర్పరచగలిగిగమన్నారు.

తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక దిగ్గజ కంపెనీలతో రాష్ట్రంలో బలమైన వ్యాపార బంధాన్ని ఏర్పరచగలిగామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన వ్యాపార వాణిజ్య విధానాలు, టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల ప్రక్రియ వంటి వాటి వలన ఇప్పటికే తెలంగాణకు తాము తీసుకువచ్చిన కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలో కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలో పాలసీలపరమైన విప్లవాత్మక నిర్ణయాలతో పాటు, మౌలిక వసతుల కల్పన ద్వారా తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణలో ప్రత్యేక స్థానాన్ని కల్పించగలిగామన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురావడంలో పాటు 24 లక్షల ఉపాధి అవకాశాలను ప్రైవేటు రంగంలో సృష్టించగలిగామన్నారు.

ముఖ్యమంత్రి ప్రతినిధి బృందం ఇలాంటి కంపెనీలతో మరోసారి చర్చలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, కేటీఆర్ తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆకాంక్షించారు. తమ పార్టీకి రాజకీయాలకు అతీతంగా కేవలం తెలంగాణనే తమ ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని తెలిపిన కేటీఆర్, ప్రస్తుత ప్రభుత్వం తాము దశాబ్ద కాలంగా నిర్మించిన బలమైన పెట్టుబడుల పునాదులపైన మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News