Saturday, November 15, 2025
Homeపాలిటిక్స్Lokesh: చేనేతకు అండగా ఉంటాం

Lokesh: చేనేతకు అండగా ఉంటాం

నేతన్నల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని నారా లోకేష్ కు విజ్ఞప్తి

చేనేతలకు అండగా ఉంటామని నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు, రాజకీయ శూన్యం నుంచి రాజకీయ భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత అన్ని పార్టీలపై ఉందని రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు, కొంకతి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళగిరిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను లక్ష్మీనారాయణ కలిసి వినతి పత్రం సమర్పించారు. రాబోయే ఎన్నికలలో చేనేతకు అధిక సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి నేతన్నల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని నారా లోకేష్ ను కోరారు. చేనేత బతుకులలో భరోసా కల్పించే వలసల నివారణకు తగిన ప్రణాళికలు తయారు చేయాలని కొంకతి లక్ష్మీనారాయణ విన్నవించారు. రాయలసీమ ప్రాంతంలో చేనేత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం అన్ని పార్టీలపై ఉందన్నారు. వారు కేటాయించే సీట్ల సంఖ్య పైనే చేనేత ఓటు బ్యాంకు ఆధారపడి ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad