Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Mahabubnagar Cong: వర్షం బాధితులకు కాంగ్రెస్ అండ

Mahabubnagar Cong: వర్షం బాధితులకు కాంగ్రెస్ అండ

ఇళ్లు ఇచ్చిన వారినే బీఆర్ఎస్ ఓట్లు అడగాలి

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తరపున వాళ్లకు ఎలాంటి సహాయం అందడం లేదని డి సి సి అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ముసురు వర్షాల వలన ఎంతో మంది పేదవాళ్ళు ఇండ్లు కూలి పోయి ఇబ్బంది పడుతున్నారని, నిలువ నీడ లేక వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆయన వాపోయారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం పేదలకు ఇస్తానని చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అక్కడక్కడా అరకొర కట్టిన ఇండ్లను కూడ కార్యకర్తలకు ఇస్తున్నారని కొన్ని అమ్ముకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికి పేదవారికి నీడ నిస్తున్నాయని తెలిపారు.పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేదలకు సహాయం చేస్తున్నామని తెలిపారు. ఎంతో మందికి ఇండ్లు ఇచ్చామని చెప్పుకుంటున్న బీ ఆర్ ఎస్ నేతలు ఇండ్లు ఇచ్చిన ప్రాంతంలో మాత్రమే ఓట్లు అడగాలని సూచించారు. అరకొర ఇండ్లు నిర్మించి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎంపీ గా ఉన్న సమయం లో ఇక్కడ చాలా హామీలు ఇచ్చారు… ఏవీ నెరవేరలేదు… పాలమూరు ప్రాజెక్టు ఇంకా పూర్తి చేయలేదు అని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన కేసీఆర్ ఎందుకు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలేదని ప్రశ్నించారు. సాగు నీటి ప్రాజెక్టు అని చెప్పి ఇప్పుడు తాగునీటి ప్రాజెక్టు చేశారని మండిపడ్డారు.పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన సంవత్సరం లోపే పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు.ఇక్కడి మంత్రులు ఇద్దరు కూడ దోచుకోవడం దాచుకోవడం అనే నినాదంతో పనిచేస్తున్నారని,..వీరి మీద కాంగ్రెస్ విచారణ చేస్తుందని అన్నారు. ఈ సమావేశం లో వినోద్ కుమార్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఫయాజ్, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు సాయి బాబా, ఎన్ ఐ సి యు అధ్యక్షులు ఫయాజ్, బెక్కరి అనిత, లక్ష్మణ్ యాదవ్, సి జే బెనహర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News