బిఆర్ఎస్ లో చేరికల పర్వం కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఈరోజు మరో కీలక నేత బిఆర్ఎస్ లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో పట్టువున్న సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందిన యువనేత అభయ్ కైలాస్ రావు పాటిల్ చిక్టాగావోంకర్ బిఆర్ఎస్ లో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా గులాబీ కండువాను స్వీకరించిన అభయ్ కైలాస్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
అభయ్ కైలాస్ రావు పాటిల్ కుటుంబం అంతా రాజకీయ నేపథ్యం ఉన్నదే కావటం విశేషం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పర్భణీ పరిసర ప్రాంతాల్లో వీరికున్న ప్రజాభిమానం గొప్పది. ఆ ప్రాంతాల్లో ఈ కుటుంబానికి మంచి రాజకీయ పట్టున్నది. పాటిల్ తండ్రి మాజీ ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు ప్రజాసేవ చేశారు. వీరి తాత దిగంబర్ రావు వాడికర్ కూడా మాజీ ఎమ్మెల్యేనే. వీరి చిన్నాయన బావు సాహెబ్ పాటిల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటీచేశారు. పాటిల్ మేనత్త ఔరంగాబాద్ మాజీ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ గా గతంలో పనిచేశారు. వీరి కుటుంబం అంతా రాజకీయనేపథ్యం కలిగినది కావడం గమనార్హం.