కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం పాలకమండలి సమావేశ గదిలో చైర్మన్ కుర్చీ స్థానంలో దేవస్థాన పాలకమండలి చైర్మన్ గీస బిక్షపతి తన కుమారుని కూర్చోబెట్టడం దుమారం రేపుతోంది. దేవాలయ పాలక మండలి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంపై కొమురవెల్లి మండల బిజెపి అధ్యక్షుడు దండ్యాల వెంకటరెడ్డి మండిపడ్డారు. దేవస్థానం, అధికార యంత్రాంగం పాలక మండలి చైర్మన్ కు తొత్తులుగా మారటంతోనే..ఛైర్మన్ ఆడింది ఆట పాడిందే పాటగా సాగుతోందన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే భక్తుల చేత తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కొమురవెల్లి మలన్న సన్నిధి, అతిథి గృహాలను తమ సొంత ఇల్లులా భావించి దుర్వినియోగం చేయడం పూర్తి అధికార దుర్వినియోగమే అవుతుందనే ఆరోపణలు మిన్నంటాయి. పాలకమండలి ఛైర్మన్ గీత భిక్షపతి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.