Sunday, June 23, 2024
Homeపాలిటిక్స్Mallapur: నామినేటెడ్ ఆశల పల్లకిలో లీడర్స్

Mallapur: నామినేటెడ్ ఆశల పల్లకిలో లీడర్స్

సుజిత్ రావు, కరం చంద్, జువ్వాడిలో ఎవరికి పదవి?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం, కార్యకర్తలు ఉత్సాహంలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు చెమటోడ్చరు, ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ ఉండే అవకాశాలున్నాయని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు నాయకులు ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు.

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీ అభ్యర్థులు గెలిచారు. ఎన్నికలు ముగిసాయి, ఫలితాలు వచ్చాయి, కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల జాతర ఉంటుందని నామినేటెడ్ పదవుల్లో గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు, పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ వెంట ఉన్నవారికి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.

కోరుట్ల నియోజకవర్గంలో గత ఎన్నికలలో టికెట్ కోసం పోటీలో ఉన్న నేతలు ఏమేరకు నామినేటెడ్ పోస్టులు ఉంటాయని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జువ్వాడి నర్సింగరావు, కల్వకుంట్ల సుజిత్ రావు, కొమిరెడ్డి కరంచంద్ లు పోటీ పడ్డారు. చివరికి నర్సింగరావుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. టికెట్ రేసులో ఉన్న సుజిత్ రావు, కరంలను కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించారు. సుజిత్ రావు, కరంచంద్ లకు ప్రభుత్వ ఏర్పడ్డాక నామినేట్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని గతంలో వారి అభిమానులు తెలిపారు. తమ నాయకులకు నామినేట్ పదవి తప్పకుండా వస్తుందని ఎదురుచూస్తున్నారు. సుజిత్ రావు, కరంచంద్ లలో ఎవరికీ నామినేటెడ్ పదవి వస్తుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎదురు చూస్తున్నారు.

వర్గపోరులో పై చేయి ఎవరిదో?

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్లో వింత పరిస్థితి ఉంది నియోజకవర్గంలో ముగ్గురు కీలక నేతలు ఉండటం, వర్గాలుగా విడిపోవడంతో రానున్న నామినేట్ పోస్టులలో ఎవరివికి పై చేయి ఉంటుందోనని ఎవరికి పదవి వస్తుందోనని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు . ఐటి , పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి కల్వకుంట్ల సుజితరావు అత్యంత సన్నిహితుడు కావడంతో తమ నేతకు కీలకమైన పదవి వస్తుందని సుచిత్ర వర్గ నేతలు చెబుతున్నారు. మాజీ శాసనసభ్యులు దివంగత కొమిరెడ్డి రాములు తనయుడైన కొమిరెడ్డి కరంచంద్ కు మంత్రివర్గంలోని కీలక నేతల సహకారం ఉండటంతో తమ నాయకునికి నామినేటెడ్ పదవి కచ్చితంగా వస్తుందని రెండవ విడుతలో తమ నాయకుని పేరు ఉంటుందని కరంచంద్ వర్గీయులు తెలుపుతున్నారు.


గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జువాడి నర్సింగరావు వర్గీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నర్సింగారావు సన్నిహితుడు కావడం వల్ల తమ నేతకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టు వస్తుందని జువ్వాడి అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

వీరికి తోడు పార్లమెంటు ఎన్నికల ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ సునీత వెంకట్, చెన్నమనేని శ్రీనివాసరావు కూడా తమకున్న పలుకుబడితో నామినేటెడ్ పోస్టులపై కన్ను వేసినట్టు , తమకు అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రభుత్వ పెద్దలతో లాభం చేస్తున్నట్టు తెలుస్తుంది.

నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఏ వర్గానికి అండదండ ఉంటుందోనని ఏ నేతకు పదవి వస్తుందోనని వచ్చిన నేత నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తారని తమ నాయకునికే పదవి రావాలని కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్నారు. ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారన్నది అత్యంత ఆసక్తిగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News