Sunday, December 8, 2024
Homeపాలిటిక్స్Mallapur: ధర్మపురి అరవింద్ కు బిగ్ షాక్, కేడర్ మూకుమ్మడి రాజీనామాలు?

Mallapur: ధర్మపురి అరవింద్ కు బిగ్ షాక్, కేడర్ మూకుమ్మడి రాజీనామాలు?

బీజేపీ కార్యకర్తల టార్గెట్ అరవింద్ ఓటమే

మల్లాపూర్ మండలంలో బీజేపీకి పెద్ద దెబ్బ పడనుంది. బీజేపీకి పెద్ద ఎత్తున రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీజేపీ శ్రేణులు ఈమేరకు తమ నేత వైఖరిపై నిప్పులు చెరుగుతూ అసహనం వ్యక్తంచేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ వైఖరి తమకెవరికీ అంతుచిక్కటం లేదని, అరవింద్ వ్యవహారశైలికి నిరసనగా మల్లాపూర్ మండలంలోని బీజేపీ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు, కిసాన్ మోర్చా, యువ మోర్చా నాయకులు సగం మంది బీజేపీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయమంతా ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అటు అరవింద్ కు పూర్తిగా తెలుసు. అయినా ఇవేవీ పట్టించుకునే ఆసక్తి బీజేపీకి అస్సలు లేకపోవటం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.

- Advertisement -

అరవింద్ ఓటమే బీజేపీ కేడర్ టార్గెట్

వచ్చే లోక్సభ ఎన్నికల్లో అరవింద్ ను ఓడగొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్దమయ్యారు. పార్టీకి విధేయులుగా ఉన్నా, పార్టీ కోసం కష్టపడుతున్న తమని పట్టించుకునే వారు లేరని, పార్టీ పటిష్టత కోసం కష్టపడిన తమని కాదని, కొత్తగా వచ్చిన వారిని అరవింద్ అందలం ఎక్కిస్తున్నారని వీరంతా వాపోతున్నారు. సొంత వర్గాన్ని తయారు చేసుకొని పార్టీని అరవింద్ నాశనం చేస్తున్నాడని ఆగ్రహంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మద్దతుగా జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారు.

మూకుమ్మడి రాజీనామాలతో పార్టీ ఖాళీ..

ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణుల మూకుమ్మడి రాజీనామాలతో మల్లాపూర్ మండలంలో సగం బీజేపీ ఖాళీ కావటం ఖాయంగా మారింది. బీజేపీ మూకుమ్మడి రాజీనామాలతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి పెద్ద మైనస్ గా మారి, కాంగ్రెస్ కు రాజకీయంగా కలిసొచ్చేలా మల్లాపూర్ లో తాజా పరిస్థితి నెలకొంది. అరవింద్ నియంతృత్వ ధోరణితో విసిగి వేశారిన బీజేపీ క్షేత్రస్థాయి సైనికులు కాంగ్రెస్ కు జై కొడితే అరవింద్, బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందని నిత్యం చర్చించుకోవటం ఇక్కడ రొటీన్ గా మారింది. ఈ పరిణామాలనీ అరవింద్ కు ఎప్పటికప్పుడు తెలుస్తున్నా ఆయన తీరులో కొంచెం కూాడా మార్పు రాకపోవటం ఈ ప్రాంతంలో రాజకీయ సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News