Sunday, December 8, 2024
Homeపాలిటిక్స్Mallapur: అంతు చిక్కనిదే అరవింద్ వ్యూహమా?

Mallapur: అంతు చిక్కనిదే అరవింద్ వ్యూహమా?

పెరిగిన బీజేపీ గ్రాఫు

ఎన్నికలు సమీపిస్తున్నాయి, రాజకీయం రోజు రోజుకూ వేడెక్కుతోంది. అభ్యర్థులు నామినేషన్ ల వేటలో ఉన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉండటం పక్కాగా కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ లతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రచార వేగం పెంచారు. గ్రామాల్లో తిరుగుతూ తమ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో లీనమయ్యారు.

- Advertisement -

అంతు చిక్కని బీజేపీ వ్యూహం

బీఆర్యస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రోజు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి నాలుగైదు సార్లు నియోజకవర్గంకు వచ్చి, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. మిగతా అభ్యర్థుల్లా రోజూ ప్రచారం చేయకపోయినా, పక్కాగా గెలుస్తామని బీజేపీ శ్రేణులకు అరవింద్ చెబుతున్నాడు. దాంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం అవధులు లేకుండా పోయింది. కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడంతో బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహంలో ఉన్నారు. రాబోయే రోజుల్లో అరవింద్ ఏం చేస్తారోనన్న ఆసక్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో విపరీతంగా ఉండటం హైలైట్.

పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్
నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ వేస్తున్న ఎత్తులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు రోజురోజుకు పార్టీలో చేరతుండటంతో పార్టీ గ్రాఫు క్రమేణా పెరుగుతూ వస్తుంది. వెరసి..అసలు ఇక్కడి బీజేపీలో ఏం జరుగుతోందో అర్థం కాక ఇతర పార్టీలు తలలుపట్టుకుంటున్నాయన్నమాట.

బీజేపీ నాయకుల సమన్వయం
కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా పోటీలో అనేక మంది ఉన్నా చివరికి అరవింద్ కి టికెట్ దక్కడంతో టికెట్ ఆశించిన నాయకులు నిరాశలో ఉన్నారు. నిరాశలో నాయకులున్న విషయాన్ని గ్రహించి, వారితో మాట్లాడి, వారిలో ఉన్న నిరాశని తొలగించడంలో విజయవంతం అయ్యారు. బిఆర్యస్, కాంగ్రెస్ అసంతృప్తులను కలుస్తూ వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో దూసుకెళ్తున్నారు అరవింద్. బీఆర్యస్, కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తుండటం విశేషం. రోజు రోజుకూ అరవింద్ అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలో ఎవరికీ అంతు చిక్కడం లేదు, రాబోయే రోజుల్లో అరవింద్ ఎలా ముందుకు వెళ్తారు. ఎలాంటి సంచలన విషయాలు, ఆరోపణలను సమీప భవిష్యత్తులో ఆయన చేస్తారన్నది మరింత ఉత్కంఠ రేపుతుండటం కొసమెరుపు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News