Saturday, October 12, 2024
Homeపాలిటిక్స్Mallapur: నర్సింగారావు, సుజిత్ రావుల పట్టు

Mallapur: నర్సింగారావు, సుజిత్ రావుల పట్టు

దసరా తర్వాతే ప్రకటన?

మల్లాపూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోరుట్ల నియోజకవర్గంలో నాలుగు వ్యవసాయ మార్కెట్లు ఉండగా కోరుట్ల, ఇబ్రహీంపట్నం మండలాల మార్కెట్ కమిటీలను ప్రభుత్వం ప్రకటించగా పాలక వర్గం ప్రమాణ స్వీకారం కూడ చేసారు.

- Advertisement -

కోరుట్ల, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీలను ప్రకటించి నెల గడిచినా మల్లాపూర్, మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలపై సందిగ్ధత నెలకొంది. రెండూ మార్కెట్ కమిటీలను ప్రకటించకపోవడం పట్ల ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోరుట్ల మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీపై నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగా రావు అలాగే టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు లు పట్టుపడుతున్నారు. తమ వారికి చైర్మన్ పదవి ఇవ్వాలని ఇద్దరు పట్టుపట్టడంతో మల్లాపూర్, మెట్పల్లి కమిటీలపై పీఠముడి నెలకొంది. నర్సింగ రావు నియోజక ఇన్చార్జి కావటం, సుజిత్ రావు స్వంత మండలం కావటంతో అధిష్ఠానం ఎటు తేల్చలేకపోతుంది.

ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మార్కెట్ కమిటీల పై కాలయాపన జరగడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పై ఆశలు పెట్టుకున్న నేతలకు ఇంకా ఎదురుచూపుగానే మిగిలింది మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎస్సీ మహిళగా రిజర్వుడ్ కావడంతో మార్కెట్ కమిటీ పీఠం దక్కించుకోవాలనుకున్న నేతలు ఇంకా ఎదురు చూడాల్సి వస్తుంది. నర్సింగరావు, సుజిత్ రావులు తమకున్న పరిచయాలతో ప్రభుత్వ పెద్దలతొ ఎవరికి వారే విన్నవించుకుంటున్నారు.

ఇద్దరు నేతలు పట్టుబట్టడంతో మల్లాపూర్ మార్కెట్ కమిటీని ఇంకా ప్రకటించలేదు ఇద్దరిలో ఏ వర్గానికి చైర్మన్ గిరి వస్తుందోనని మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా వరకైనా కమిటి వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News