Sunday, December 8, 2024
Homeపాలిటిక్స్Mallapur: ప్రచారంలో జువ్వాడి కూతుర్లు

Mallapur: ప్రచారంలో జువ్వాడి కూతుర్లు

ఇంటింటికీ జువ్వాడి కుమార్తెల ప్రచారం

తండ్రి గెలుపు కోసం తనయల ఆరాటం కొనసాగుతోంది. దీంతో ప్రచార పర్వంలో జువ్వాడి కూతుళ్లు కోరుట్ల నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగా రావు గెలుపు కోసం అయన కూతుర్లు డా. రితిమా , డా. నైనికలు ప్రచారం చేస్తున్నారు. మొగిలిపేట గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. నర్సింగా రావుని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జువ్వాడి శేఖర్, మండల కాంగ్రెస్ నాయకులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, నల్ల బాపు రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News