Sunday, December 8, 2024
Homeపాలిటిక్స్Mallapur: కోరుట్ల ఎమ్మెల్యే రేసులో యువ నేతలు

Mallapur: కోరుట్ల ఎమ్మెల్యే రేసులో యువ నేతలు

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కోరుట్ల శాసనసభ స్థానానికి పోటీ చేసేందుకు నాయకులు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగా మల్లాపూర్ మండలం నుంచి అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి శాసనసభ స్థానానికి పోటీ చేసేందుకు నాయకులు సన్నద్ధమయ్యారు . అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్,  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వకుంట్ల సుజిత్ రావు పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. రెండు పార్టీల అధినాయకత్వాలు టికెట్లు ఇస్తే పోటీ చేసేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు.

- Advertisement -

ఇద్దరు నాయకులకు స్థానికత అంశం కలిసి వచ్చే అవకాశం ఉండడంతో శాసనసభ స్థానానికి పోటీ చేసేందుకు అన్నీసిద్ధం చేసుకున్నారు. గత నాలుగు ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు గెలుపొందారు.. ఆయన సొంత మండలం కూడా మల్లాపూర్ కావడం, ఈ సారి మండలం నుండి కీలక నేతలు శాసనసభ పోరులో ఉండబోతుండటం తో మండలం లో రాజకీయ వేడి మొదలయ్యింది.

ఇదీ సంజయ్ నేపథ్యం..

మండలంలోని రాఘవపేట గ్రామానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ రాబోయే కోరుట్ల శాసనసభ స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సమాజ సేవలో ముందుండి ప్రజలకు చేరువగా ఉంటూ, డిస్కౌంట్ డాక్టర్ గా పేరు సంపాదించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్ )కు అత్యంత సన్నిహితుడుగా పేరుంది, తండ్రికి తగ్గ తనయుడుగా ఉంటూ రాబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.  నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు చేరువగా అయ్యేందుకే సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంచుతూ మరోవైపు మెగా ఉద్యోగ మేళా నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి జోరుగా మోసుకెళ్తున్నాడనే పేరు తెచ్చుకున్నారు. 

అన్నీ పాజిటివ్సే..

ఇక బలాబలాల విషయానికి వస్తే ప్రతిపక్షాల్లో ఉన్న అనైక్యత ఈయనకు కలిసి వచ్చే అవకాశంగా ప్రజలు చెబుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా, డిస్కౌంట్ ల డాక్టర్ గా పేరు సంపాదించడం, ప్రతిపక్ష నాయకుల కుమ్ములాటలు, యువ నాయకుడుగా, విద్యా వేత్తగా మంచి పేరు ఉండటం, కేటీఆర్ కు మిత్రుడుగా ఉండటం వంటివి కలిసి వచ్చే అవకాశాలు.  కానీ సీనియర్, జూనియర్ నాయకుల మధ్య విభేదాలు, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలు  కొంచం ఇబ్బందికరం అయ్యే ప్రమాదాలు లేకపోలేదు. 

సుజిత్ రావ్ నేపథ్యం ఇది..

మండలంలోని మొగిలిపేట గ్రామానికి చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ కల్వకుంట్ల రాజేశ్వరరావు తమ్ముడి కొడుకుగా కె.వి రాజేశ్వరరావు వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేశారు కల్వకుంట్ల సుజిత్ రావు.  టీఆర్ఎస్ ఆవిర్భావంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీ పరిస్థితి కోసం కష్టపడి, పార్టీలో రాష్ట్ర నాయకత్వం లో మంచి పేరు పొందిన నాయకుడిగా ఎదిగి, ఎమ్మెల్యే టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో  పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్  పార్టీలో సుస్థిర స్థానం సంపాదించుకొని రాబోవు శాసనసభ ఎన్నికల్లో కోరుట్ల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.  గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ అధినాయకత్వం టికెట్ ఇవ్వకున్నా పార్టీలోనే కొనసాగుతూ పార్టీని బలోపేతం చేస్తూ.. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. అధికార ప్రభుత్వ పార్టీపై వ్యతిరేకత అధికార పార్టీ ఎమ్మెల్యేపై  తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో శాసనసభ స్థానంపై పోటీ చేసేందుకు సుజిత్ రావు సిద్ధమయ్యారు.

బలాబలాలు ఎలా ఉన్నాయంటే..

గతంలో ఉన్న పాత పరిచయాలు కలిసి వచ్చి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొంది అందర్నీ కలుపుకుపోయే తత్వంతో ముందుకు సాగడం, కొత్త నాయకత్వం వైపు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూడటం, స్థానిక నాయకుడిగా పేరూపొందటం కలిసి వచ్చే అంశాలుగా మారాయి.  కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, వర్గ విబేధాలు, ఎమ్మెల్యే స్థానానికి నలుగురు పోటీ పడటం, ఒకరంటే ఒకరికి పడకపోవటం,  కాంగ్రెస్ పార్టీ లో అనైక్యత , పార్టీ కార్యకర్తలు వర్గాలుగా విడిపోవడం వంటివి ఇబ్బందికి గురిచేసే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చే అవకాశం.

మండల నాయకునికే పట్టం..

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి మండల నాయకునికి పట్టం కట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నట్టు నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అది అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయినా మరోసారి మల్లాపూర్ మండలానికి చెందిన వ్యక్తికి కోరుట్ల నియోజకవర్గ శాసన సభ్యునిగా అవకాశం దక్కుతుందని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News