Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Manchiryala: టికెట్ కేటాయింపుతో అయోమయం!

Manchiryala: టికెట్ కేటాయింపుతో అయోమయం!

నియోజకవర్గంలో 60 శాతం ఓటర్లు బీసీలే

మంచిర్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ అని ప్రకటించడంతో ఇక్కడ అయోమయ పరిస్థితులు నెలకొవడం హైలైట్.

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అధికార బ్ఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను ప్రకటన చేయడంతో ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి ఇతర రాజకీయ పార్టీలలో సందడి మొదలైంది. అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించడంలో రాజకీయ పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఎన్నికలపై గెలుపు నిలుపుతాడని ఆయా పార్టీలు సర్వేలను నిర్వహించుకుంటున్నాయి. ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహులు తమ తమ దరఖాస్తులను ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి తమ దరఖాస్తులను సమర్పించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ తరుణంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఏండ్ల తరబడి ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే టికెట్ కేటాయించడంతో బీసీలలో చైతన్యం ఏర్పడి పోరుబాట పడుతున్నారు. రానున్న ఎన్నికలలో బీసీలు ఎన్నికల బడిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలలో బీసీలకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి తన నివాసంలో ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు టికెట్లు ఇవ్వాలని అధికార బిఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి తెచ్చారు. మంచిర్యాల నుండి లక్షెట్టిపేట వరకు బీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తమ వాదనను వినిపించారు.. నియోజకవర్గంలో బీసీలకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

నియోజకవర్గంలో బీసీల ఓట్లు 60 శాతం ఉన్నా 75గా ఇప్పటికీ బీసీలకు టికెట్లు ఇచ్చేందుకు ప్రధాన పార్టీలన్నీ ఎందుకు జంకుతున్నాయని బీసీలు నిలదీస్తున్నారు. వెరసి..రానున్న ఎన్నికలలో బీసీలకే టికెట్ కేటాయించాలని పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చే అవకాశాలున్నాయి. బీసీలలో ఒకే వ్యక్తిని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో పాల్గొని అతనికి అన్ని పార్టీలకు చెందిన బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు సపోర్ట్ చేసి గెలుపొందించి చట్టసభలకు పంపించాలని డిమాండ్తో ముందుకు సాగుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ లో ఇప్పటికే అనేక మంది తమ దరఖాస్తులను అధిష్టానానికి అందించారు. బీఆర్ఎస్, బిజెపిలో సైతం బీసీల అభ్యర్థులను ఎంపిక చేయాలని తమ దరఖాస్తులను అందించి అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా ఈసారి బీసీలకే అధికార పార్టీలు సీట్లు కేటాయించి బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు సమాచారం.

నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తుంది. అధికార పార్టీ నుండి ఇప్పటికే మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు టికెట్టు కేటాయించినట్లు ప్రకటన జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుండి పుస్కూరి రామ్మోహన్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, తమకి టికెట్ కేటాయించాలని కోరినట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కేవీ ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వంగల దయానంద్, డాక్టర్ నీలకంఠేశ్వర్ తమకు అధిష్టానం అభ్యర్థనలు అందించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా బిజెపిలో సైతం ఎర్రబెల్లి రఘూనాథ్ రావు, మరికొందరు తమకే సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News