Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Manchiryala: బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన ఈటల

Manchiryala: బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన ఈటల

బిజెపి అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాం

తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిలో కార్మికులను, డ్వాక్రా మహిళలను నమ్మించి కెసిఆర్ మోసం చేశారని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నస్పూర్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభించిన బైక్ ర్యాలీని పలు కార్మిక వాడల్లో రోడ్ షోలు నిర్వహించి అనంతరం సిసిసి కార్నర్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

- Advertisement -

కెసిఆర్ సింగరేణికి చేసింది ఏమి లేదని అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిచ్చినట్టుగా సింగరేణిలో కార్మికులకు పదివేల నూతన క్వాటర్ల నిర్మాణం, దేశంలోని నాలుగు రాష్ట్రాలతోపాటు ఆస్ట్రేలియాలో సైతం సింగరేణిని విస్తరింపచేస్తామన్న సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటాయే తప్ప ఆచరణలో ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 73వేల మంది కార్మికులుండగా నేడు 43వేలకు వచ్చారని, సింగరేణిలొ అన్ని విభాగాలను కాంట్రాక్టర్ల చేతికిస్తూ కాసులు దోచుకుంటున్నారని అర్పించారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రుణమాఫీలు ఇస్తామని చెప్పి మూడు సంవత్సరాలైనా నయాపైస వేయలేదన్నారు.

బిజెపి అధికారంలోకి వస్తే దొరల పాలన పోయి బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి చేయగల సత్తా కలిగిన వ్యక్తి వెరబెల్లి రఘునాథ్ అని తనకు ఓటేస్తే ఈటలకు ఓటేసినట్టేనని రఘునాథ్ ని అధిక మెజార్టీతో గెలిపించి, సింగరేణి ప్రాంతంలో విద్య, ఉద్యోగాలకి, ఉపాధికి దోహదపడే వ్యక్తిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్, కార్యవర్గ సభ్యుడు అగల్ డ్యూటీ రాజు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News