టిడిపి అధిష్టానం బిసి నేత అయిన రాఘవేంద్ర రెడ్డికి టిడిపి టికెట్ ఖరారు చేయడం వల్ల ఆయనను ఎమ్మెల్యేగా గెలుపించుకోవడం మన అందరి బాధ్యత అని టిడిపి కౌతాలం మండలం నాయకులు ఉలిగయ్య, కోసిగి మండల నాయకులు ముత్తు రెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న, బిజెపి నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మాధవరం గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీ కుటుంబ సభ్యులలో ఒకరుగా భావించి ఎమ్మెల్యేగా రాఘవేంద్ర రెడ్డి పోటీచేస్తున్నాడనుకొని గెలిపించాలని కోరారు. బిసి లంటే రౌడీలు కాదు సేవకులం అన్నారు. రేపటి నుండి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా ప్రచారం చేసి మంత్రాలయంలో విజయ పతాకం ఎగరేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.
2024 లో తప్పకుండా మన జనసేన, టీడీపీ,బీజేపీ అధికారం లోకి వస్తుందని జోస్యం చెప్పారు. బిసిలంటే దద్దమ్మలు అంటున్న వాళ్లకు అని, సవాల్ మా మీద గెలిచి ఆ మాట చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. పొత్తు కూటమి అభ్యర్థి పోటీ చేయడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని అన్నారు. మీకు రెండు సార్లు మద్దతు చేశామని మీరు కూడా మాకు ఒక్కసారి మద్దతు ఇవ్వాలని తిక్కారెడ్డిని కోరారు. బాలనాగిరెడ్డి కోవర్ట్ అని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని తెలిపారు. మా ఐక్యతతో రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం లో ఉమ్మడి టీడీపీ జెండా ఎగరవేసి చరిత్ర తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మా నాన్న కల..
మా నాన్న రామిరెడ్డి కలలు సాకారం చేసేందుకు ఒక సారి ఎమ్మెల్యేగా ఆశీర్వాదించాలని మంత్రాలయం టిడిపి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి కోరారు. బిసిలకు అవకాశం కల్పించిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యేగా గెలిచి బహుమతి గా ఇవ్వాలని కోరారు. అందరు సహకారం అందించాలని కోరారు. ఎంతో నమ్మకంతో నాకు టిడిపి టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చైనాయుడు, టిడిపి ముఖ్య నాయకులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిని పూలమాలలు వేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
మహా కూటమి సమావేశంలో రామకృష్ణ, మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, సురేష్ నాయుడు, సతీష్ నాయుడు, పెద్దకడుబురు టీడీపీ నాయకులు హనుమంతరెడ్డి, విజయ్ , కోసిగి నర్సిరెడ్డి ,ఎరిగేరి రామలింగ , మాలపల్లి లక్ష్మన్న పెద్ద ఎత్తున మంత్రాలయం నలుమూలల నుండి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.