Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Medipalli: సీనియర్ సిటిజన్స్ పై సీరియస్ రాజకీయాలు

Medipalli: సీనియర్ సిటిజన్స్ పై సీరియస్ రాజకీయాలు

సొంత నిధులతో భవనం పూర్తి చేస్తా-మల్లారెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి మల్లారెడ్డి సుడిగాలి పర్యటనలు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సీనియర్ సిటిజన్స్ భవనానికి కేటాయిస్తూ శుక్రవారం మంత్రి మల్లారెడ్డి చేసిన శంకుస్థాపనలతో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయం ఒకసారి గా హీటెక్కింది. వివరాల్లోకి వెళితే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 26వ డివిజన్ వీరారెడ్డి నగర్ లోని కొంత స్థలాన్ని గత ఇరవై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ అప్పటి గ్రామ పంచాయతీలోని పాలకవర్గం చేయగా అప్పటినుండి ఆ స్థలంలో పార్టీ కార్యాలయం పిల్లర్ల కే పరిమితమై అసంపూర్తిగా మిగిలిపోయి నిర్మాణ దశలో ఉండగా శుక్రవారం మంత్రి మల్లారెడ్డి అదే నిర్మాణంలో సీనియర్ సిటిజన్స్ భవనానికి శంకుస్థాపన చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శంకుస్థాపనలపై బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ల లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి బోడుప్పల్ వీరారెడ్డి నగర్ లో ఈరోజే ఉదయం 11:30 గంటలకు సీనియర్ సిటిజన్స్ భవనానికి శంకుస్థాపన చేస్తానని చెప్పడంతో బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహానికి గురై శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అంబేద్కర్ చౌరస్తా వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరగా పోలీసులు వారిని అక్కడే అడ్డుకున్నారు.

- Advertisement -

మరోపక్క మంత్రి మల్లారెడ్డి వీరారెడ్డి నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదని సీనియర్ సిటిజన్స్ భవనమని తెలియజేస్తూ శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి తీరుని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు తోటకూర అజయ్ యాదవ్, బొమ్మక్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, నాయకులు పొద్దుటూరి వెంకటేష్ గుప్తా లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు. నెల రోజుల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం : మంత్రి మల్లారెడ్డి…
వీరారెడ్డి నగర్ లో నూతనంగా శంకుస్థాపన చేసిన సీనియర్ సిటిజన్స్ భవనాన్ని నెల రోజుల్లో తన సొంత నిధులతో పూర్తి చేస్తానన్నారు. నిర్మాణ పనులకు ఎవరైనా అడ్డు తగిలితే ఉపేక్షించేది లేదని అవసరమైతే కేసులు నమోదు చేయండి. ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చినా శంకుస్థాపన ఆగేది లేదన్న మంత్రి మల్లారెడ్డి పోలీసులతో ఈ నిర్బంధమెందుకు…? : కార్పొరేటర్ అజయ్ యాదవ్… ఎవరు వచ్చినా, ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చినా సీనియర్ సిటిజన్స్ భవనానికి శంకుస్థాపన చేస్తానని ప్రగల్బాలు పలికిన మంచి మల్లారెడ్డి, శంకుస్థాపన కార్యక్రమానికి మేము వస్తుంటే పోలీసులతో మమ్మల్ని అడ్డుకొని నీవు కొబ్బరికాయలు కొట్టి దొంగ చాటుగా శంకుస్థాపన చేయడమేంది. అసలు బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధికి నీవు ఎన్ని నిధులు కేటాయించావో ప్రజలకు స్పష్టం చేయాలి.నిజాయితీగా ఓట్లు బోడుప్పల్ ప్రజలు ఓట్లు వేయాలంటే అభివృద్ధి చేసి చూపించు కానీ ఇలా చిల్లర రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News