Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Jupalli: ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ త్వరలో కనుమరుగవుతుంది

Jupalli: ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ త్వరలో కనుమరుగవుతుంది

బీఆర్ఎస్ లో మిగిలేది కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే

ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్ నాయకులకు ఇంకా జ్ఞానోదయం కావడం లేదంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నాయకుల ఆహాంకార దోరణి, కుటుంబ పాలన వల్ల ప్రజలు విసిగి, వేసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ఎవరి పార్టీ గల్లంతు అవుతుందో మరో మూడు నెలలు ఆగితే తేలుతుందని జూపల్లి మండిపడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు అవడం ఖాయమన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని, అందుకే పార్టీని బతికించుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిపై మంతనాలు కొనసాగుతున్నాయని, గత పదేండ్లలో బీజేపీతో అంటకాగారు. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారని జూపల్లి ఆరోపించారు.

- Advertisement -

సొంతపార్టీ నేతలే బీఆర్ఎస్ పై అవిశ్వాసం పెడుతున్నారు..

సమీక్షల పేరుతో సమావేశాలు పెట్టి, రాజకీయ విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ తరపున పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రావడం లేదని, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానాలు పెడుతూ..ఆ పార్టీని వీడుతున్నారన్నారు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో కేసిఆర్ కుటుంబం తప్ప ఒక్కరు కూడా మిగలరని హెచ్చరించారు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని జూపల్లి ఆరోపించారు. బీఆర్ఎస్ క్యాడర్ ను కాపాడుకునేందుకే ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ అమలు చేయదు అని మైండ్ గేమ్ ఆడుతున్నారని, మీరు ఎంత చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో ఖాళీ అవడం ఖాయమన్నారు మంత్రి. మీరు ఎంత అసత్య ప్రచారం చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మరని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని, ప్రతీ పైసాకు బీఆర్ఎస్ నేతలు లెక్క చెప్పాల్సిందేనని జూపల్లి తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News