KTR vs Bandi Sanjay : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడేక్కాయి. గత కొద్ది రోజులు బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా నేడు తారాస్థాయికి చేరింది. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తాను డ్రగ్స్ టెస్టుకు సిద్దమని చెబుతూనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్రగ్స్ పరీక్ష కోసం రక్తం ఇచ్చేందుకు సిద్దమని, అవసరం అయితే జట్టు, గోళ్లు, కిడ్నీ కూడా ఇస్తానన్నారు. తాను డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే కరీంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ తన చెప్పులతో తానే కొట్టుకుంటాడా..? అంటూ మండిపడ్డారు.
” డ్రగ్స్ పరీక్ష కోసం ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా..ఏ డాక్టర్ ను తీసుకువస్తాడో, ఏ గుండు కొట్టే ఆయనను తీసుకొస్తాడో తీసుకురమ్మనండి. నా రక్తం ఇస్తా.., నా చర్మం ఇస్తా.., నా గోర్లు ఇస్తా.., నా బొచ్చు ఇస్తా.. ఇంకా కావాలంటే కిడ్నీ కూడా ఇస్తా.. నేను క్లీన్ చిట్‌తో బయటకు వచ్చిన తరువాత బండి సంజయ్ కరీంనగర్ కమాన్‌లో తన చెప్పుతో తానే కొట్టుకుంటారా..? దీనికి సిద్దమైతే నేను ఇక్కడే ఉంటాను. రమ్మను ఏ డాక్టర్ తీసుకువస్తాడో రమ్మను” అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బండి సంజయ్ మనిషా..? పశువా…? అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. ఫాల్తూ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను తిడిఏ ఓట్లు రావు. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా అని సవాల్ విసిరారు. బండి సంజయ్ నిజంగా రాజన్న భక్తుడు అయితే వేములవాడకు రూ.100 కోట్లు ఎందుకు తేలేకపోతున్నాడు. ఇప్నటికైనా కరీంనగర్ ప్రజలకు ఏమైనా తీసుకురా. ఇదే చివరి అవకాశం. బడ్జెట్ సమావేశాలకు వెళ్లు.. హిందీ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడు కానీ కరీంనగర్‌కు ఏమైనా తీసుకురా అని కేసీఆర్ అన్నారు.