Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్MLA Hafeez khan: తండ్రి బీజేపీ, కొడుకు టీడీపీ

MLA Hafeez khan: తండ్రి బీజేపీ, కొడుకు టీడీపీ

వ్యాపారం కోసమే తప్ప ప్రజలకు మేలు చేయడం కోసం కాదు

కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీలో తండ్రి టీజీ వెంకటేష్ ఒక పార్టీలో కొడుకు టీజీ భరత్ మరో ఒక్క పార్టీలో వున్నారని ఎద్దేవా చేశారు. టీజీ వెంకటేష్ కుటుంబానికి సిద్దాంతాలు లేవు కానీ డబ్బు మాత్రం ఉందన్న హఫీజ్… టీజీ భరత్ తన తండ్రి డబ్బులతో తన స్థాయి పెద్దని చెబుకుంటున్నారన్నారు. గతంలో టీజీ వెంకటేష్, టీజీ భరత్ చెప్పినట్లుగా కర్నూలు ఎగ్జిబిషన్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్నారు. కర్నూలు ఎగ్జిబిషన్ పై ప్రత్యేక మీడియా దృష్టి పెట్టి కథనం ప్రచారం చేయాలి, వారు చేసిన అరాచకాలపై బయట పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని తండ్రి, కొడుకు ప్రజలకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News