రాజ్ పాకాల, విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్న ఆయన, కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అంటూ మరో బాంబు పేల్చారు. గత ప్రభుత్వం డ్రగ్స్ కేసుని ఏ విధంగా దారి మళ్లించారో ప్రజలకు తెలుసని, జన్వాడ పామ్ హౌస్ అంటేనే కాంట్రవర్సీ అని అనిల్ ఆరోపించారు. ఒక సారి దీపావళి, ఇంకోసారి గృహ ప్రవేశం అంటున్నారని, డ్రగ్స్ ని స్కూల్ పిల్లల వరకు తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వానిదే అని పార్లమెంట్ సభ్యులు అనిల్ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తుంటే బీఆర్ఎస్ డ్రగ్స్ ని ప్రేరేపించాలని చూస్తున్నారని ఎంపీ భగ్గుమన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏమి చేయాలనుకుంటోందని ఆయన ప్రశ్నించటం విశేషం. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడని, రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడని అనిల్ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు స్టేట్మెంట్ ను మారుస్తుండని, ఫామ్ హౌస్ దొర కేసిఆర్ డిజిపికి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుండని, ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముందని, కేసీఆర్ ఎక్కడ ఉండు అని ప్రజలు అడుగుతున్నారని అనిల్ మీడియా ముందు రెచ్చిపోయారు.