Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Munugodu: పోటీకి రాజగోపాల్ రెడ్డి సై

Munugodu: పోటీకి రాజగోపాల్ రెడ్డి సై

14 ఎంపీ సీట్లు గెలుస్తాం

భువనగిరి పార్లమెంటు సీటు అధిష్టానం నా అభిప్రాయాన్ని అడిగినప్పుడే బిజెపి పార్టీ కూడా బీసీలకే కేటాయించినది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు కేటాయించాలని నేను అభిప్రాయపడ్డాను కానీ కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ కావాలని నేను కోరినట్లు ప్రజలలో కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని మునుగోడు శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

- Advertisement -

వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు స్థానాన్ని బీసీలకే ఇవ్వాలని ప్రెస్మీట్లో కాకుండా చిట్ చాట్ లో మొదట్లోనే నేను వివరించానని అన్నారు. బిజెపి పార్టీ కూడా బీసీలకు ఇచ్చింది కదా మన పార్టీలో కూడా బిజెపికి బీసీకి ఇవ్వాలని కోరాను, కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ కావాలన్న ఎప్పుడు నేను అడగలేదు ఎందుకు ఈ వార్తలను ప్రజలలో దుష్ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది కావాలని చేస్తున్నారని అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అధిష్టానానికి ఒక శాసన సభ్యునిగా, భువనగిరి పార్లమెంట్ మాజీ ఎమ్మెల్సీ, ఎంపీగా దీపాదాసు పార్లమెంటు స్థానం గురించి అభిప్రాయం అడిగినప్పుడు అధిష్టానం మీరు సర్వే చేసుకొని భువనగిరి పార్లమెంటులో కావాల్సిన అభ్యర్థిని నిర్ణయించండని చెప్పినట్టు వెల్లడించారు.

ఫలానా వ్యక్తికి ఇవ్వమని నేను చెప్పలేదు లక్ష్మీ కావాలని నేను చెప్పలేదు, మీరే సర్వే ను నిర్వహించి బలమైన అభ్యర్థికి టికెట్ కేటాయించమని కోరాను.గతంలో నేను చేసిన పార్లమెంటు స్థానానికి చేసిన సేవలు ,సోదరుడు కుమార్ రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సేవలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవి త్యాగం చేసిన తీరును కావచ్చు వ్యక్తిగతంగా కూడా మానవత దృక్పథం తోటి వేల లక్షల మందికి ఆర్థిక సహాయం చేసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు కార్యక్రమాలు చేసి మునుగోడు ఎలక్షన్ లో నాకు సపోర్ట్ గా నా భార్య సపోర్టు చేసింది. స్వతగా పదవులు కావాలని ఎప్పుడూ కూడా నేను ఆశ పడలేదు కోమటిరెడ్డి లక్ష్మి అంటే తెలంగాణ ఉద్యమ కోసం సోదరుడు వెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం చేస్తే ప్రజల కోసం ఈ ప్రాంత కోసం ప్రత్యేకంగా పదవికి రాజీనామా చేసిన చరిత్ర మనది అన్నారు. మునుగోడు నియోజకవర్గం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజల కోసం పనులు చేసే అవకాశం రాష్ట్ర అభివృద్ధిని పార్టీ ఆదేశిస్తే 17 పార్లమెంటు స్థానాల్లో ప్రచారం చేస్తాను అన్నారు.


రాష్ట్రంలో అన్ని పార్లమెంటు స్థానాల కంటే భువనగిరి పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం ,కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ ,తెలంగాణ ప్రజల పేదల రాజ్యం వచ్చిందని సంతోషపడుతున్నారు,తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మునుగోడు పి ఎ సిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు, వేణు రెడ్డి రాజు ,తాడూరి వెంకట్ రెడ్డి , బుజ్జి,జాల వెంకటేశ్వర్లు, తాటికొండ సైదులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News