Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Kommuri: ఎక్కువ మెజారిటీ ఇచ్చిన గ్రామానికే నా మొదటి జీతం

Kommuri: ఎక్కువ మెజారిటీ ఇచ్చిన గ్రామానికే నా మొదటి జీతం

ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి

నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అత్యధికంగా ఓట్లు వేసి మెజారిటీ వచ్చిన గ్రామానికి ఎమ్మెల్యేగా నా మొదటి జీతం ఆ గ్రామానికి ఇస్తానని మాజీ ఎమ్మెల్యే, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. చేర్యాల మండలంలోని నాగపురి, గండిగుంట, వేచరేణి, చిట్యాల, కమలాయపల్లి అర్జున్ పట్ల గ్రామాలలో కొమ్మూరి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ఆయనకు మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు పర్యాయాలు స్థానికేతరులకి అప్పజెప్పితే చేర్యాల అంగడి స్థలాన్ని ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రతిపక్ష నేతలపైన అక్రమంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురివేశారని గుర్తు చేశారు.

ఈ ప్రాంత బిడ్డగా తపస్ పల్లి, బొమ్మకూరు, లద్దునూరు రిజర్వాయర్లు తీసుకొచ్చి మన రైతన్నలకు పంట పొలాలకు సాగునీరు తెచ్చానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కక్ష కట్టారని అన్నారు. ఏ గ్రామంలో చూసిన ఆనాటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తామని అన్నారు. స్థానికుడైన నన్ను ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గిరికొండల్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్, ఆది శ్రీనివాస్, కొమ్మురవి , కొమ్ము నర్సింగరావు, ఉడుముల భాస్కర్, రెడ్డి, రామగల్ల పరమేశ్వర్, పూర్మ ఆగం రెడ్డి, ఉడుముల బాల్ రెడ్డి, ముస్త్యాల యాదగిరి, సందుల సురేష్, వంగ జయ, పొన్నబోయిన మమత, ఓగ్గు మల్లేశం, కాటం మల్లేశం గూడెపు మహేష్, తాళ్ల పళ్లి వెంకటేష్ గౌడ్, రాగుల శ్రీనివాస్ రెడ్డి, పర్పాటకం మాధవరెడ్డి,లక్ష్మారెడ్డి, దేవనబోయిన సత్యం, ఏగుర్ల ఎల్లయ్య, కర్రె ఆంజనేయులు, బింగి దుర్గయ్య, పాకాల ఇసాక్, పుల్లని వేణు, బిరెడ్డి బాల్రెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News