కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం సీఎం కేసీఆర్ తో నాగం భేటీ కావటం విశేషం. ప్రగతి భవన్లో బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి, నాగం జనార్దన్ రెడ్డి. కాగా గతంలో నాగం, కేసీఆర్ కలిసి టీడీపీలో చాలాకాలం పనిచేశారు. ఎంతోమంది మాజీ టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరినా.. నాగం మాత్రం కేసీఆర్ పార్టీలో చేరేందుకు ఎన్నడూ ఆసక్తి చూపకపోగా సొంత కుంపటి పెట్టుకుని ఆతరువాత బీజేపీ, కాంగ్రెస్ లో చేరి ఆశించిన గుర్తింపు, పదవులు రాక బేజారయ్యారు. గత కొంతకాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. కేసీఆర్ తో భేటీ అయిన నాగం ఇక లాంఛనంగా బీఆర్ఎస్ కండువా కప్పుకోవటమే మిగిలి ఉంది.
Nagam with KCR: కేసీఆర్ తో నాగం భేటీ
ఎట్టకేలకు కేసీఆర్ ను కలిసిన నాగం