Monday, July 8, 2024
Homeపాలిటిక్స్Nandikotkuru: అందరి చూపు బైరెడ్డి శబరిపైనే

Nandikotkuru: అందరి చూపు బైరెడ్డి శబరిపైనే

నంద్యాల టిడిపి ఎంపీ అభ్యర్థి

నందికొట్కూర్ మాజీ శాసనసభ్యులు, రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు, సీనియర్ రాజకీయ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరిని నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా టిడిపి అధిష్టానం ప్రకటించింది. నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న బైరెడ్డి శబరి ఇటీవల తన తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో కలిసి టిడిపి తీర్థం పుచ్చుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల కూటమిలో భాగంగానే శుక్రవారం విడుదల చేసిన టిడిపి ఎంపీ అభ్యర్థుల జాబితాలో నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి గా బైరెడ్డి శబరి ని నియమించారు. ఆమెను నిర్ణయించడంతో పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న టిడిపి నాయకులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో సంబరాలు చేసుకున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బైరెడ్డి శబరి నంద్యాల వైఎస్ఆర్సిపి పార్లమెంట్ అభ్యర్థి పోచా పై ఘన విజయం సాధించడం ఖాయమని టిడిపి కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

రాజకీయ వారసత్వం

నందికొట్కూరుకు కాంగ్రెస్ పార్టీగా 1978, 1983, 1989, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, 1983లో ఇండిపెండెంట్ ( స్వతంత్ర)అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చరిత్ర సృష్టించిన , మాజీ మంత్రిగా పనిచేసిన బైరెడ్డి శేషశయనారెడ్డి మనుమరాలు బైరెడ్డి శబరి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1962 నుంచి 1970 వరకు అసెంబ్లీ స్వీకర్ గా , ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కోవెలకుంట్ల ( ప్రస్తుతం బనగానపల్లె నియోజకవర్గం ) ఎమ్మెల్యే బి. వి. సుబ్భారెడ్డి కుమారుడు 1983 లో అప్పటి ఎమ్మెల్యే బి. నరసింహరెడ్డి కుమార్తె బైరెడ్డి భారతి కూతురు బైరెడ్డి శబరి. తల్లి బైరెడ్డి భారతీ ఎంఎస్ సి ఫుడ్ టెక్నాలజీలో గోల్డ్ మెడల్ సాధించారు, ఎంబీఏ చేసి రెండు పీజీ పట్టాలు అందుకొని పట్టభద్రులుగా నిలిచారు. అదేవిధంగా తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నందికొట్కూరు అసెంబ్లీకి 1994, 1999 రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఆనాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి నేటికీ గ్రామాల్లో కనపడుతున్నాయి, అలాగే రాయలసీమ యాత్ సర్వీస్ సోసైటీ, రాయలసీమ పరిరక్షణ సమితి, రాయలసీమ స్టీరింగ్ కమిటీ స్థాపించి రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాయలసీమలోని 8 జిల్లాల్లో రాజీలేని ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసి రాయలసీమ లోని కరువు, వలసలు, నిరుద్యోగ, వెనుకబాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి రాయలసీమ ఉద్యమబిడ్డగా నిలిచారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు గా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పనిచేసారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు రాయలసీమలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమైన యువ నాయకుడు, ఎన్టీఆర్ కు బైరెడ్డి వీరాభిమానిగానే కొనసాగుతున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బైరెడ్డి భారతీ ల కూతురు బైరెడ్డి శబరి కావడంతో బైరెడ్డి వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

బైరెడ్డి శబరి సేవా కార్యక్రమాలు

కర్నూలు, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చెంచు, దళిత కాలనీలలో ఉచిత మెగా వైధ్య శిభిరాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించి, ఉచితంగా మందులు అందిస్తున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యమం చేస్తూ నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసారు. ఇటీవల బీజేపీ కి రాజీనామా చేసి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో Dr. బైరెడ్డి శబరి, ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీలో చేరారు. బైరెడ్డి శబరి సేవా కార్యక్రమాలు, ఆమె రాజకీయ కుటుంబ నేపధ్యాన్ని గుర్తించి టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News