రాష్ట్రంలో వైసిపి గతి తప్పిన పాలన చేస్తోందని, అక్రమ కేసులను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిక్క మీద వెంట్రుక పీకలేరనీ సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచనల వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఒక్కరూపాయి అవినీతి జరగకపోయినా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. నంద్యాల ఆర్కే పంక్షన్ హాల్ లో టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ లో ఒక్కరూపాయి అవినీతి జరగకపోయినా కక్ష పూరితంగా అక్రమాకేసులు బానాయించారని అన్నారు. వైసిపి ప్రభుత్వం ఎన్నికేసులు పెట్టినా బయపడ మని మా బావ పిక్కలోని వెంట్రుక పీకలేరని సంచనల వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు,లోకేష్ చేపట్టిన యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పట్టడమ్ వల్ల వైసిపి ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా పోయిందని అన్నారు. అన్ని సర్వేల్లో వైసిపి ఇంటికి పోతుందని,టిడిపి గద్దె ఎక్కుతుంది అని వచ్చిన సర్వెలకి మతిపోయి ప్రజల దృష్టి మళ్లించడానికి అక్రమకేసులు బానాయిస్తున్నరని పేర్కొన్నారు. ప్రజల్లో విప్లవం రావాలి, మన భవిషత్తు కాపాడుకోవడానికి అందరూ బయటకు వచ్చి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో పోలవరం ఊసెలేదన్నారు. మంత్రి అమర్నాథ్ అమరావతి రైతులను చులకన చేస్తూ పైడ్ ఆర్టిస్టులు అని అనడం ఆయనకే చెల్లుబాటు అయిందని అన్నారు.
అసెంబ్లీలో అమరావతి గ్రాఫిక్స్ అన్నారు, మీరు చేసిన వాటి ఎంఓయూలు చూపెట్టరు,పెట్టుబడుల వివరాలు చెప్పని పరిస్తితి అన్నారు. రాష్ట్రంలో వున్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడంతో యువతకు ఉపాధి కరువై,ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు అన్నారు. బాబు హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ లో ఎందరో శిక్షణ పొంది దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. నీతిగా వున్న నాయకులు దేవుడికి కూడా భయపడరు, కేసులు, జైళ్లకు భయపడరు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాత్రికేయులపై దాడులు, పోలీసులకు టి ఏ, డి ఎ కట్ చేశారని, వీక్లీ ఆఫ్ లు లేవని, ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అలవెన్సులు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. పోలీసులకు సమస్యలు ఎన్ని వున్నా బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.ఉద్యోగుల సమస్యలు ఎన్ని చెప్పినా తక్కువే అన్నారు. ఉద్యోగులు,ప్రజలు రోడ్లపై రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. క్యాబినెట్ లో ఆమోదం పొందిన స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే వారాహి యాత్రకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మద్దతు పలుకుతారు అన్నారు. దసరా పండుగకు టిడిపి భవిషత్తు ప్రణాళిక ప్రకటిస్తామని అన్నారు. టిడిపి, జనసేన యాక్షన్ కమిటీ వేయాలని నిర్ణయించామని అన్నారు. రెండు పార్టీల నుంచి కమిటీ వేసి పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో అచ్చం నాయుడు, పయ్యావుల కేశవ్, వంగల పూడి అనిత, మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మా నంద రెడ్డి, గౌరు చరిత, ఏవి సుబ్బారెడ్డి, వేదుర్ల రామచంద్ర రావు, ఎన్.ఎం.డి.ఫిరోజ్, న్యాయవాది తులసిరెడ్డి, మల్లెల రాజశేఖర, గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.