Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Nandyala: వాలంటీర్లూ.. రాజీనామా చేయద్దు

Nandyala: వాలంటీర్లూ.. రాజీనామా చేయద్దు

మీకు మేం అండ: శబరి

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్కువ గౌరవ వేతనంతో వాలంటీర్ల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నదని, ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలుగా పనిచేయించేందుకు వాలంటీర్లతో వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయించడం అన్యాయమని నంద్యాల టీడీపీ లోకసభ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల కార్యాలయంలో డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. నిరుద్యోగుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలండర్ అని ఇదేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగి నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధి లేకుండా మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి ఎక్కడ అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని జగన్ ప్రభుత్వాన్ని నీలాదీశారు.

- Advertisement -

వాలంటీర్లతో వైసీపీ నాయకులు రాజీనామా చేయిస్తూ రాష్ట్రంలో కొత్త డ్రామాకు తెరలేపారని, డిగ్రీ, పీజీ, పిహెచ్ డిలు పూర్తి చేసి ఉద్యోగం దొరకక, చెడు అలవాట్లకు వెళ్ళకుండా, ఖాళీగా ఇంటి వద్ద కుటుంబానికి భారం కాకుండా రూ.5000 ల గౌరవ వేతనంతో వాలంటీర్లు పనిచేస్తున్నారని, వారిని బెదిరించి రాజీనామా చేయిస్తూ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు పనిచేయించాలనుకోవడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో త్వరలో టీడీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాబోతున్నారని, వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం వస్తుందని, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రెండు రోజులుగా నంద్యాలలో క్లస్టర్ సమావేశాలు పెట్టి వాలంటీర్లు రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. వాలంటీర్లు భయపడొద్దని, తాము అండగా ఉంటామని టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News