పాదయాత్ర పేరుతో బీజేపీ, కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతున్నాయని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. మేం తలుచుకుంటే మీరు పల్లెల్లో తిరుగలేరని ఐకే రెడ్డి హెచ్చరించటం విశేషం. రానున్న ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ హ్యట్రిక్ విజయం సాధించేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటి ఆత్మీయ సమ్మేళనం నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా ఇంచార్జ్ గంగాధర్ గౌడ్, బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లా వెంకట్రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాయల సంస్థల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక రమణ, ఆశ్రిత రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తూ వేధింపులకు, బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.