Tuesday, July 2, 2024
Homeపాలిటిక్స్New Front: దీదీ-అఖిలేష్ యాదవ్ ల కొత్త ఫ్రంట్

New Front: దీదీ-అఖిలేష్ యాదవ్ ల కొత్త ఫ్రంట్

తాను ఎవరితో జట్టు కట్టనని భీష్మించుకున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెట్టు వీడుతున్నారు. ఈశాన్య రాష్ట్ర ఎన్నికల్లో టీఎంసీకి కరెంట్ షాక్ కొట్టినంత పని కావటంత దీదీ కాస్త మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. దీంతో ఇదే ఊపులో కొత్త ఫ్రంట్ కు జై కొడుతున్నారు. కాంగ్రెస్సేతర ఫ్రంట్ కోసమే మొదటి నుంచి మొగ్గు చూపుతున్న మమతా తాజాగా సమాజ్ వాదీ పార్టీతో టీమప్ అయ్యేందుకు సై అంటున్నారు. బీజేపీని చావుదెబ్బ కొట్టేందుకు అఖిలేష్ యాదవ్ తో చేతులు కలిపిన మమతా.. కాంగ్రెస్, బీజేపీని సమ దూరంలో ఉంచనున్నట్టు వెల్లడించారు.

- Advertisement -

దీంతో సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేసేందుకు సిద్ధమైన మమతా, అఖిలేష్.. ఈనెల 23న ఒడిసా సీఎం, బిజూ జనతా దళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ తో కీలక భేటీ నిర్వహించనున్నట్టు కోల్ కత్తాలో సంయుక్త ప్రకటన చేశారు. ప్రతిపక్ష పార్టీల ముఖంగా రాహుల్ గాంధీనే బీజేపీ ప్రస్తావించటం ఈ ప్రాంతీయ పార్టీలకు మింగుడు పడటం లేదు. దీంతో ఇదే విషయాన్ని వీరు తెగేసి చెబుతూ..విపక్ష నేత రాహుల్ గాంధీ ఎలా అవుతారంటూ విరుచుకుపడుతుండటం విశేషం. రాహుల్ గాంధీ ప్రతిపక్షాలకు బిగ్ బాస్ కాదని వీరు ప్రకటన చేస్తుండటం మారుతున్న దేశ రాజకీయాలకు అద్దం పడుతోంది.

అయితే తమది థర్డ్ ఫ్రంట్ ఏమాత్రం కాదని వీరు చెప్పుకుంటుండటం హైలైట్. బీజేపీపై పోరాడేందుకు అవసరమైనంత సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉందని వీరు గర్జిస్తున్నారు. బీజేపీ వ్యాక్సిన్ తీసుకున్న వారు సీబీఐ, ఈడీ, ఐటీలకు ఏమాత్రం బెదరరని ఈసందర్భంగా అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News