Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Niranjan Reddy: రాజ భవనాన్ని పునరుద్ధరిస్తాం

Niranjan Reddy: రాజ భవనాన్ని పునరుద్ధరిస్తాం

ఇది వనపర్తి కీర్తి కిరీటం

రాజభవనాన్ని పూర్తి స్థాయిలో పునరుద్దరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మార్నింగ్ వాక్ లో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల సందర్శించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అత్యంత వైభవోపేతంగా దీన్ని పునరుద్దరిస్తామని, ఇది వనపర్తి కీర్తి కిరీటమని, వనపర్తి రాజ భవనానిది వందేళ్లకు పైబడిన చరిత్ర అని, దీనిది అరుదైన నిర్మాణశైలి అన్నారు. 24 ఎకరాల ప్రాంగణాన్ని గతంలో కళాశాలకు కేటాయించారనీ, కాలక్రమంలో పోషణ లేక ఈ రాజభవనం కొంత దెబ్బతిన్నదనీ, చారిత్రక భవనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు.

- Advertisement -

వనపర్తి వాసుల ఆకాంక్ష మేరకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, కళాశాల భవనం, విద్యార్థిని, విద్యార్థుల వసతిగృహాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.22 కోట్లు కేటాయించారనీ అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి కేటాయించినందుకు వనపర్తి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. పూర్తి స్థాయిలో భవనాన్ని పునరుద్దరించి వినియోగంలోకి తీసుకువస్తామని, నియోజకవర్గంలోని వివిధ రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయని అన్నారు.

గత 70 ఏళ్లలో ఎన్నడూ ఇంతలా నియోజకవర్గానికి నిధులు విడుదలైన దాఖలాలు లేవని,ప్రజలు ఆశించిన, ఊహించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేసి ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News