Friday, November 22, 2024
Homeపాలిటిక్స్No confidence in Vemulavada: వేములవాడ అర్బన్ మండల వైస్ ఎంపిపిపై అవిశ్వాసం

No confidence in Vemulavada: వేములవాడ అర్బన్ మండల వైస్ ఎంపిపిపై అవిశ్వాసం

ముందే చెప్పిన తెలుగుప్రభ

తెలుగుప్రభ ముందే చెప్పినట్లుగా వేములవాడ అర్బన్ మండల వైస్ ఎంపీపీ రేగులపాటి రవి చందర్ రావుపై ఎంపిటిసి సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు స్థానిక ఆర్డీవో మధుసూదన్ కు ఎంపీటీసీలు బుర్ర లహరిక-శేఖర్ గౌడ్, బాస రాజశేఖర్, వనపర్తి దేవరాజ్ లు ఫారం-2 సమర్పించారు. ఇదిలా ఉండగా వైస్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు తెలుగుప్రభలో ప్రత్యేక కథనం ప్రచురితమైన గంటల వ్యవధిలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలతో వేములవాడ అర్బన్ మండల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

- Advertisement -

అడుగడుగునా అనూహ్య పరిణామాలు

మరోవైపు వైస్ ఎంపిపి ఎన్నికలో నిమిషానికో అనూహ్య పరిణామం చోటుచేసుకుంటుంది. ముందుగా అనుకున్నట్లు నలుగురు ఎంపిటిసి సభ్యుల మద్దతుతో అధికార పార్టీకి చెందిన బాస రాజశేఖర్ లేదా వనపర్తి దేవరాజ్ లలో ఎవరో ఒక్కరు వైస్ ఎంపిపి అవుతారనే చర్చ జరిగింది. అయితే వైస్ ఎంపీపీ అయ్యేందుకు రాజశేఖర్ సుముఖత చూపడం లేదని, అదేక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన దేవరాజ్ ముందుగానే వైస్ ఎంపిపి ఆఫర్ ఇస్తేనే హస్తం గూటిలో చేరినట్లు సమాచారం. దీంతో దేవరాజ్ ఎన్నిక ఖాయం అనుకున్నారు అందరూ కానీ ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది.

అనూహ్యంగా తెరపైకి బుర్ర లహరిక-శేఖర్ గౌడ్

ఇకపోతే వైస్ ఎంపీపీ ఎన్నికలో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో వైస్ ఎంపిపి రేసులోకి బీజేపీ ఎంపీటీసీ సభ్యురాలు బుర్ర లహరిక-శేఖర్ గౌడ్ లు వస్తున్నట్లు, అన్ని అనుకున్నట్లు జరిగితే వారే వైస్ ఎంపిపి అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం మొత్తం 6 ఎంపిటిసి స్థానాలకు గాను బి.ఆర్.ఎస్-03, కాంగ్రెస్-02, బీజేపీ-01 మంది సభ్యులను కలిగి ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్లు బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అనుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కు వైస్ ఎంపిపి పీఠం దక్కవద్దని భావించి బి.ఆర్.ఎస్ లోని ముగ్గురు సభ్యులు బీజేపీ అభ్యర్థికి మద్దత్తు తెలిపితే నలుగురు సభ్యుల సంపూర్ణ మెజారిటీతో ఒకే ఒక్క బీజేపీ సబ్యురాలైన బుర్ర లహరిక శేఖర్ గౌడ్ ల వైస్ ఎంపీపీ ఎన్నిక ఖాయంగానే కనిపిస్తుంది. ఇదే కనక జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే. దీనికి తోడు గతంలో రూరల్ మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు అనుసరించిన వ్యూహన్నే ఇక్కడ కూడా అమలు చేస్తే వేములవాడ అర్బన్ మండలంలోనూ రూరల్ మండల సీనే రిపీట్ కానున్నట్లు, ఇదే కనక జరిగితే బుర్ర లహరిక-శేఖర్ గౌడ్ లంత అదృష్టవంతులు మరెవరూ లేరని, అనుకోకుండా పదవి రావడం రాజకీయ వ్యవస్థలో మిరాకిల్ అంటూ చర్చ కొనసాగుతోంది. వేచి చూడాలి మరి ఏమి జరుగుతోందో?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News