Nominated positions
ఏపీలో నామినేటెడ్(Nominated positions ) పదవుల జాతర మెుదలైంది. 47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టనున్నారు.

ప్రకటించిన 47 ఏఏంసి ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటించనుంది టిడిపి.
గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్ పోస్టుల భర్తీకి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. మహానాడు కంతా అన్ని పదవులు భర్తీ చేయాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం నుంచి పెద్ద సంఖ్యలో ఆశావాహులు ప్రయత్నాలు ఆరంభించారు.
ఏకంగా 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తొలి జాబితాలో 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందికి అవకాశం కల్పించారు. రెండో జాబితాలో మొత్తం 59 మందికి అవకాశం కల్పించారు.