Saturday, February 15, 2025
Homeపాలిటిక్స్Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30. కౌంటింగ్ డిసెంబర్ 3న జరుగనున్నాయి.

- Advertisement -

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ గడువు కూడా తీరనుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల డేట్లను ప్రకటించింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రావటంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఫస్ట్ టైం ఓటర్లు ఎక్కువమంది ఉండటం ఈ ఎన్నికల ప్రత్యేకతగా ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. 679 స్థానాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఈ 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది.

తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

తెలంగాణలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. వృద్ధులకు ఇంట్లోనుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తుండటం విశేషం. 3.17 కోట్ల మంది ఓటర్లు తెలంగాణలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News