పాలేరు కాంగ్రెస్ లో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. దీంతో క్యాడర్ కు ఏం చేయాలో పాలుపోక వెర్రెత్తి ఉన్నారు. లీడర్ల ప్రవర్తన అర్థంకాని కార్యకర్తల్లో కాక రేపుతున్న హై టెన్షన్ లోతులు మీరూ తెలుసుకోండి.
కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కొమ్ములటలు కొత్తమి కాదు గొడవలు గ్రూపులు సహజం. శాసనసభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేపో మాపో అభ్యర్థులను కూడా ప్రకటించే పనిలో ఉంది. అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో పాలేరు తెలంగాణ కాంగ్రెస్ లో లీడర్ల దగ్గర సఖ్యత లేదని మరోసారి రుజువైంది.
పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలకేంద్రంలో టి పి సి సి, సీఎల్ పి, ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటలనుండీ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తో రోకో నిర్వహించాలని ఆ కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులకి కార్యకర్తలకు మీడియా ప్రతినిధులకు హాజరుకావాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, వస్తున్నారని శుక్రవారంన వారి అనుచరులు ఓ ప్రకటనలో ఆహ్వానం పంపారు. ఆహ్వానాన్ని మన్నించి శనివారం రోజున మండల కేంద్రానికి అఖిలపక్ష లీడర్లు, నాయకులు, మీడియా ప్రతినిధులు హాజరుకాగా అక్కడికి ఇంకా చేరుకొలేదు.
రాయల కోసం పార్టీ లీడర్లు, నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష నాయకులు మరియు మీడియా ప్రతినిధులు రాయల కోసం ఎదురుచూస్తున్న సమయంలో స్థానిక జడ్పిటిసి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం శ్రీను, ఆ యొక్క కార్యక్రమానికి చేరుకుని ఆ ప్రారంభించాల్సిందిగా అఖిలపక్ష నాయకులకు పిలుపునిచ్చారు. వారిలో కొందరు రాయల నాగేశ్వరరావు, రాలేదు వారి కోసమే చూస్తున్నాం అనగా ఎవరి కోసం చూడవలసిన అవసరం లేదు నేను పిలుస్తున్నాను కార్యక్రమాన్ని ప్రారంభిస్తారా లేదా అని కొందరు అఖిలపక్ష నాయకుల్ని పిలిచే ప్రయత్నం చేయగా వారు అక్కడి నుండి కదల్లేదు ఈలోపు రాయల నాగేశ్వరరావు, అక్కడికి వచ్చారు వెంటనే రోడ్డుపై కేటాయించి నినాదాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, మాట్లాడారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాయాల నాగేశ్వరావు, మాట్లాడుతున్న సమయంలో బెల్లం శ్రీను, అక్కడి నుండి కారులో వెళ్లిపోవడంతో ఇప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూప్ తగాదాలు తగ్గినట్టుగానే ఉన్నాయని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ వర్గ పోరుతో.. కందాలకు కలిసొచ్చే అంశమేనా?
తెలంగాణ శాసనసభ ఎన్నికలకోసం ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.! తొలి జాబితాలోనే కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ కాగా ఇప్పటికే ప్రజాధరణ పొందిన కందాల ప్రజలతో తన కుటుంబాన్ని మమేకం చేస్తూ ప్రజల్లో కలిసిపోతూ ప్రజానాడి దొరికించుకునే ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం వర్గ విభేదాలతో గొడవలతో బిజీలో ఉన్నారు.నేడు రేపు తొలి జాబితాని విడుదల చేసే పనిలో ఉన్నప్పటికీ గ్రూపు తగాదాలు మాత్రం సద్దుమనగట్లేదని చెప్పాలి. ఎప్పటినుంచో గ్రూపుల లొల్లిలతో సీనియర్లు ఒకపక్క జూనియర్లు మరోపక్క అంటూ సమావేశాలు ఎవరికి వారుగా యమునా తీరుగా నిర్వహించుకుంటూన్నారు. ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు హస్తం హై కైమాండు టిక్కెట్లు ప్రకటించక ముందే పంచాయతీ అవుతున్న లీడర్లు ప్రకటించాక పాలేరుకు నియమించిన అభ్యర్థితో కలిసి ఎంతవరకు పని చేస్తారనేది వేచి చూడాలి.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వర్గం ఒక గ్రూపుగా తుమ్మల నాగేశ్వరరావు, వర్గం మరో గ్రూపుగా రాయల నాగేశ్వరరావు, వర్గం రామ్ రెడ్డి చరణ్ రెడ్డి, రేణుకా చౌదరి, ఇలా ఎవరికి వారు వర్గ పోరుతో విడివిడిగా తిరగడంతో కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది. ఇలా విరివిరిగా తిరగడం వలన కందల ఉపేందర్ రెడ్డి కి కలిసొస్తుందేమోనని పాలేరు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. టిక్కెట్లు ప్రకటించాకైనా వర్గాలు వదిలేసి ఏకమై పనిచేస్తారా లేక ఇలానే ఉంటారా…?