పర్వతగిరి మండల మున్నూరుకాపు కుల సంఘం ఎమ్మెల్యే ఆరురికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి.. బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరురి రమేష్ ను హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మూడోసారి కూడా ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి వర్దన్నపేట నియోజకవర్గ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతున్నాని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నానని తెలిపారు. ప్రతీ రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలలో పలుపంచుకుంటూ వారికి అండగా నిలుస్తున్నానని తెలిపారు. తనను నమ్మి వచ్చిన ప్రతీ కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్, పర్వతగిరి సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్ రావు, ఎంపిటిసి మాడుగుల రాజు, ఉప సర్పంచ్ రంగు జనార్దన్, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు డాక్టర్ ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి బైరు రాజు, ఉపాధ్యక్షులు బుక్క కుమారస్వామి, కోశాధికారి బక్కి రాజు, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, గొల్లం రవి, బక్కీ సంజీవ, బక్కిశ్రీనివాస్, పిట్టల రంజిత్, బక్కి యాకయ్య తదితరులు ఉన్నారు.
Parvathagiri: ఆరూరికి మద్దతుగా కుల సంఘాల తీర్మానాలు
అభివృద్ధికి అండగా ప్రజలు