Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Peapulli: కర్నూల్ జిల్లాలో యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన

Peapulli: కర్నూల్ జిల్లాలో యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన

ప్రజా సమస్యలే పరిష్కారంగా, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ సర్కార్ ను గద్దెదింపడమే లక్ష్యంగా యువనేత లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర 69వ రోజు డోన్ నియోజకవర్గంలో మొదలైంది. ఈ సందర్బంగా ప్యాపిలి మండలంలోని పలు గ్రామాల్లో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్బంగా నారా లోకేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో అన్యాయాలు, అక్రమాలు, కబ్జాలు రాజ్యమేలుతున్నాయని, ఇదేమని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రతి విషయాన్ని గుర్తుంచుకుంటామని, అధికారంలోకి వచ్చాక వడ్డీతోసహా తిరిగి చెల్లిస్తామని అన్నారు. జగన్ దళిత ద్రోహి అని, వైసీపీ అధికారం చేపట్టాక దళితు భూములపై కబ్జాలు, అరాచకాలు పెట్రేగి పోయాయని ఆయన వాపోయారు.

వైసీపీ పాలనకు చరమగీతం పాడతామన్న లోకేష్ యువగళం పాదయాత్రకు జిల్లాలో అనూహ్య స్పందన రావటం విశేషం. ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు యువనేత లోకేష్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News