Sunday, December 8, 2024
Homeపాలిటిక్స్Pilot Rohit Reddy: కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేయడానికి సిగ్గుండాలి

Pilot Rohit Reddy: కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేయడానికి సిగ్గుండాలి

బీఆర్ఎస్ నా కన్న తల్లి

అమ్ముడు పోయిన కొడుకులరా ఖబడ్దార్… తల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీని మోసం చేయడానికి సిగ్గుండాలి అనాకొడుకులకి అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మండిపడ్డారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. బీఆర్ఎస్ నుండి ఇతర పార్టీలోకి మారుతున్న లుచ్చాన కొడుకులరా మీకే చెప్తున్న. మీరు బిఆర్ఎస్ పార్టీని వీడిన పార్టీకి ఒరిగేది ఏమీలేదు. మీ లాంటి వల్ల పార్టీకి రేపటికి నాటికి నష్టమే. తాండూరు అభివృద్ధి కోసం నేను పార్టీ మారడం జరిగింది కానీ డబ్బులకు ఆశ పడి కాదు, అన్న మాట నిలబెట్టుకున్న, తాండూరు అభివృద్ధి అనేది ప్రజలకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది, అలా అంటే మొయినాబాద్ ఫామౌస్ లో మీ రోహిత్ రెడ్డికి రూ.100కోట్లకు బేరం పెట్టిన అమ్ముడు పోలేడు. నా కన్నతల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీని మోసం చేయను. ముఖ్యంగా  బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలకు  చెప్తున్న .. మీరు ఎం దిగులు చెందకండి రూ.50వేలకు అమ్ముడు పోయిన చిల్లర నా కొడుకులు. అదేవిధంగా  తాండూరు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా తెలువని కొందరు నాయకులు వచ్చి తాండూరులో గెలుపొందుతామని ఊహల్లో ఉన్నారు. ఎవరు పార్టీ మారిన ఏమీ కాదు ఈసారి తాండూరులో బిఆర్ఎస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయం. మంత్రి మహేందర్రెడ్డి సహకారంతో తాండూరులో మరింత కనివిని ఇరగని రీతిలో తాండూర్ అభివృద్ధి చేసి చూపిస్తానని తెలుపుతున్నాను… ఈ కార్యక్రమంలో  తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వీణ శ్రీనివాస్ చారి, తాండూర్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ రవి గౌడ్, బషీరాబాద్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, పెద్దముల్ ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తమరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News