Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Emmiganuru politics: చంద్రబాబును కలిసిన బీవీ

Emmiganuru politics: చంద్రబాబును కలిసిన బీవీ

టికెట్ ఓకేనా? నో అన్నారా?

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేస్వర రెడ్డి కలిశారు. మంగళగిరిలో చంద్రబాబు నాయుడును బీవీ జయనాగేశ్వర రెడ్డి కలిశారు. త్వరలో జరిగే ఎన్నికలలో టిడిపి నుండి పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాలో ఎమ్మిగనూరు నుండి టికెట్ అశీస్తున్న బీవీ పేరు లేదు. దీంతో బీవీ వర్గీయులు సందిగ్ధంలో పడ్డారు. దీంతో ఈ భేటీ తరువాత బాబు బీవీకు సీటు ఒకే అన్నారా? నో అన్నారా అనేది ఎమ్మిగనూరు నియోజకవర్గంలో హాట్ హాట్ డిబేట్ కు దారితీసింది.

- Advertisement -

పాపం బీవీ.. బీసీ ఓవైపు, బీజేపీ మరోవైపు ..

మరోవైపు టిడిపి అధిష్ఠానం బిసికు సీటు ఇస్తుందనే ప్రచారం ఊపందుకుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మచాని డాక్టర్ సోమనాథ్, కోంకతి లక్ష్మీనారాయణలు కూడా టిడిపి టికెట్ కోసం సకల ప్రయత్నాలు చేస్తూ సర్వం ఒడ్డుతున్నట్టు టాక్. వీరితో పాటు టిడిపి, బిజేపి పొత్తు కుదిరితే మా నాయకుడికు టికెట్ ఇప్పించేందుకు బిజేపి అధిష్టానం హామీ ఇచ్చినట్లు బిజేపి కన్వీనర్ కేఆర్ మురహరి రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడును కలిసిన బీవీ భవిష్యత్ ప్రణాళిక ఏంటనే నరాలు తెగే టెన్షన్లో ఆయన అనుచర వర్గం ఉంది. నువ్వే గెలుస్తావు, ప్రజలకు అండగా ఉండు అనే భరోసాను బాబు ఇచ్చినట్లు మాత్రం ప్రస్తుతానికి ప్రచారం సాగుతోంది. కుల-మత సమీకరణాలు, సర్వే నివేదికలుృ ఆధారంగానే సీట్లు కేటాయిస్తాని టిడిపి అధిష్ఠానం తేల్చి చెబుతోంది. దీంతో ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ ఇప్పట్లో తేలేలా లేదు. అంతవరకూ ఆశావాహులతో పాటు వారి అనుచరగణంలో ఉత్కంఠ కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News