Saturday, April 12, 2025
Homeపాలిటిక్స్Ponguleti son in campaign: పిలిస్తే పలికే నేత మీ శీనన్న

Ponguleti son in campaign: పిలిస్తే పలికే నేత మీ శీనన్న

బైక్ పై తిరుగుతూ, అందరినీ పలుకరిస్తూ ప్రచార బాట

ఏ సమస్య ఎదురైనా, ఏ ఇబ్బంది వచ్చినా శీనన్నా అని పిలిస్తే వెంటనే పలికే నేత మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని..తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తనయుడు, కాంగ్రెస్ యువనేత పొంగులేటి హర్షా రెడ్డి అన్నారు. కూసుమంచి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయాన్నే ఇక్కడికి చేరుకొని స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు భారీగా హాజరై ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓ దశ దిన ఖర్మకు హాజరై చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత బైక్ ర్యాలీగా బయలుదేరి.. శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అందరినీ పలకరిస్తూ, కరచాలనాలు చేస్తూ.. ఆత్మీయంగా కలిసిపోయారు. ఈ సందర్భంగా పొంగులేటి హర్షారెడ్డి మాట్లాడుతూ.. పొంగులేటి శీనన్న జనం మనిషని, నిత్యం ప్రజాసేవలోనే తపిస్తారని తెలిపారు. అధికార పార్టీ ఇబ్బందులు పెట్టినా, ఆయన పదవిలో లేకున్నా ప్రజల్లోనే ఉన్నారని, వారి బాగు కోసమే ఆలోచిస్తున్నారని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పాలేరులో శీనన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధిలో పాలేరు రూపు రేఖలను మారుస్తారని పొంగులేటి హర్షారెడ్డి అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News