Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Prakash Ambedkar: దళిత బంధు సరికొత్త ప్రయోగం, బాగుంది

Prakash Ambedkar: దళిత బంధు సరికొత్త ప్రయోగం, బాగుంది

దళిత బంధు పథకం చాలా బాగుందని, దళితుల ఆర్థిక, సామాజిక సాధికారత, దళితుల ఉద్ధరణ కోసం ఆలోచించి కెసిఆర్ కొత్తగా దళతబందు పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడంవల్ల దళితులకు విద్యాపరంగా మాత్రమే కాకుండా ఆర్థిక ప్రగతిని సాధించడానికి దోహదపడుతుందని డా. బి.ఆర్. అంబేడ్కర్ మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ తెలిపారు. హుజురాబాద్ నియోజక వర్గంలో అమలవుతున్న దళితబందు పథకాన్ని పరిశీలించడానికి రాష్ట్ర బిసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి హెలిక్యాప్టర్ ద్వారా అయన హైదరాబాద్ నుండి హుజురాబాద్ కు వచ్చారు. ఆయనకు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, విప్ కౌశిక్ రెడ్డిలు ఘన స్వాగతాన్ని పలికారు.

- Advertisement -

జమ్మికుంట, హుజురాబాద్ లలో విజయవంతంగా నడుస్తున్న 6 దళితబందు యూనిట్లను పరిశీలించడంతో పాటు పథకం ద్వారా చేకూరిన ప్రగతిని, ఆర్థిక పురోగతిని గురించి లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హుజురాబాద్ కేంద్రంలో 6గురు లబ్దిదారులు కలిసి ఏర్పాటు చేసిన మెడ్రనైజ్డ్ ఫ్లెక్సి షాపును ప్రారంభించారు. ఈ షాపు ద్వారా ఇంటర్నెట్ సహాయంతో ఎక్కడినుండైన ఫ్లెక్సీని తయారు చేయవచ్చని, హైదరాబాద్ తరువాత జమ్మికుంటలోనే మొదటిసారిగా నెలకొల్పామని లబ్దిదారులు తెలపడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జమ్మికుంటలో అనుగొల్డెన్ బెకరిని సందర్శించి షాపులో తయారు చెసిన ప్రత్యేకమైన కేకును కట్ చేసి లబ్దిదారులకు తినిపించారు. అనంతరం జమ్మికుంటలోని అంబేడ్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలోఅయన మాట్లాడుతూ, పేదల కొరకు అనేక కార్యక్రమాలను ప్రభుత్వాలు రూపొందించి ప్రవేశపెట్టినప్పటికీ, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కౌంటర్ గ్యారెంటీ, మార్టిగేజ్ అడగడం వల్ల రుణాలు పొందలేకపోయారన్నారు. దళితబందు వంటి గొప్పపథకం ద్వారా సాధించిన ఘనతను ఎ పథకాలు సాదించలేకపోయాయని, దళితబందును విజయవంతం చేయడంలో కృషిచేసిన జిల్లా అధికారయంత్రాంగానికి ఈ సందర్బంగా పేరుపేరున కృతజ్జతలను తెలియజేశారు. ఆస్థులను తనఖాక్రింద చూపెడితేగానీ బ్యాంకులు అప్పులు ఇవ్వవు, అలాంటి పరిస్థీతులు దళితులకు ఎదురవకుడదని వారికి ఆర్థిక తోడ్పాటును అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి మార్టిగేజ్ గాని, ఆస్థులు లేవి చూపించాల్సిన అవసరం లేకుండా దళితబందు పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బు జమ చేయడం గోప్పవిషయమని, ఈ పథకం ద్వారా దళితుల జీవన ప్రమాణాలు మెరగయ్యాయని అన్నారు. దళితబందు పథకం దేశంలో సరికొత్త ప్రయోగమని ఉద్ఝాటించారు.

దళితబందు లాంటి మహోన్నత పథకాన్ని ఒక్క తెలంగాణాలొ మాత్రమే కాకండా దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని తద్వారా దళితులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్దిని గడిస్తారని ఆకాంక్షించారు. దళితులకు చదువుతో పాటు ఉపాధి లోను రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటే ఉండడంతో సామాజికంగా, ఆర్థికంగా వారి జీవితాల్లో అద్బుతమైన మార్పులు చోటుచేసుకోవడంతో నిన్నటి వరకు కూలీలుగా, డ్రైవర్లుగా పనిచేసిన వారు షాపులు, వాహనాలకు ఓనర్లుగా మారినా విషయం తాను తన కళ్ళతో చూడడం జరిగిందన్నారు. చదువుతోపాటు ఉపాధి కల్పించే పథకాలు అమలు చేస్తేనే దళితుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి అన్నారు. దళిత బంధు పథకం ద్వారా కెసిఆర్ దేశానికి దారి చూపారన్నారు. అనంతరం డిగ్రి కళాశాల మైదానంలో ఎర్పాటు చెసిన దళితబందు వాహనాలను గురించి జిల్లా కలెక్టర్ వివరించగా, ఒక్క హుజురాబాద్ నియోజక వర్గంలోనే ఇంతమంది లబ్దిదారులు ఇన్ని వాహనాలకు యజమానులయ్యారని సంతోషాన్ని వ్యక్తంచేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, చెన్నూరు ఎమ్యెల్యే విప్ బాల్క సుమన్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సిపి సుబ్బరాయుడు, సుడా చైర్మన్ జి వి రామకృష్ణ రావు, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి సురేష్, ఈడి ఎస్సి కార్పోరేషన్ అధికారి నాగార్జున, హజురాబాద్ ఆర్డీఓ హరిసింగ్, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందే రాదిక, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News