Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Raipur: ప్రియాంకకు స్పెషల్ వెల్కం, 6,000 కేజీల రోజా పూలతో పూలబాట

Raipur: ప్రియాంకకు స్పెషల్ వెల్కం, 6,000 కేజీల రోజా పూలతో పూలబాట

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీకి రాయ్ పూర్ లో గ్రాండ్ వెల్కం లభించింది. రాయ్ పూర్ లో జరుగుతున్న 85వ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనే ప్రియాంక కోసం ఈ ప్రత్యేక పూలబాటను పార్టీ కార్యకర్తలు రూపొందించటం హైలైట్ గా నిలిచింది.

- Advertisement -

6,000 కేజీల రెడ్ రోజ్ పూల రెక్కలతో వీధులన్నీ నింపేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంకకు ఘన స్వాగతం ఇచ్చారు. రోజ్ కార్పెట్ తో ఎయిర్ పోర్టు వీధిని నింపేసి, ఒకటే నినాదాలతో హోరెత్తిస్తూ ప్రియాంకకు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ప్లీనరీ వేదిక వరకూ పలు జానపద, సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు. రాయ్పూర్ మేయర్ ఐజాజ్ ఢెబార్ ఆధ్వర్యంలో ఈ హంగామా సాగింది. వాడవాడలా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంక బాటవెంట రోజా పూల వర్షం కురిపించటం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News