Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Rajanna Sirisilla: నిప్పులు చెరిగిన పొన్నం

Rajanna Sirisilla: నిప్పులు చెరిగిన పొన్నం

తన స్టైల్లో ఉత్సాహం నింపి..

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కార్యకర్తల సన్నాహక సమావేశాల జోరుగా సాగుతున్నాయి. సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల విసృత స్థాయి సమావేశం వాడివేడిగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరెపల్లి మోహన్, వెలిచాల రాజేందర్, జిల్లా కాంగ్రెస్ నేతలు, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

సమావేశానికి భారీగా హాజరయ్యారు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు. ఈసందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రేణులకు దిశా నిర్దేశాన్ని ఘాటుగా చేయటం హైలైట్.

కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి..

“ఈ వేములవాడ నియోజకవర్గంలో 283 బూత్ లు ఉన్నాయి..160 బూత్ లలో మెజారిటీ వచ్చింది.. 80 బూత్ లలో మెజారిటీ రాలేదు.. ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గా 15 వేల మెజారిటీ తో గెలిచారు.. ఈ ఎన్నికల్లో మొత్తం 283 బూత్ లలో మెజారిటీ రావాలి.. అందరూ కలిసి కష్టపడి పని చేయాలి..బూత్ లలో మెజారిటీ తెచ్చిన వారికి నామినేటెడ్ పదవి,మీకు కావాల్సిన అభివృద్ధి పనులకు మీ పనితీరు కొలమానం.. మీ పని తీరు బట్టే మీకు పదవులు వస్తాయి.. ఏ ఉర్ల లో ఉన్న వారు ఆ ఊర్లలో ప్రజలకు చెప్పాలి.. పార్టీ అమలు చేస్తున్న పథకాలు తీసుకుపోవాలి..వినోద్ కుమార్ కి ఓటు అడిగే హక్కు లేదు..కవిత అరెస్టు పై డ్రామా ఆడుతున్నారు.. అందరూ బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చూస్తున్నారు..బీజేపీ మరోసారి వస్తె అంబేద్కర్ రాజ్యాంగం బదులు నియంతృత్వం వస్తది. ఉత్తర భారతదేశంలో మోడీ గ్రాఫ్ పడిపోతుంది..నరేంద్ర మోడీ 10 సంవత్సరాల్లో తెలంగాణకి ఏం ఇచ్చారో బండి సంజయ్ చెప్పు.. బండి సంజయ్ మీరు ఏం తెచ్చారు..విద్యా సంస్థలు తెచ్చవా ..వైద్య సంస్థలు తెచ్చావా.. కరీంనగర్ కి ఎం తెచ్చావు..ప్రసాద్ స్కీమ్ ద్వారా జోగులాంబ టెంపుల్ కి నిధులు వచ్చాయి.. మరి వేములవాడ రాజన్న ,కొండగట్టుకి ఎందుకు నిధులు తేలేదు.. బండి సంజయ్ చెప్పాలి..ఈ 5 సంవత్సరాలు బండి సంజయ్ మీ ఉర్లోకి ఎన్నిసార్లు వచ్చారు..నేను ఎంపిగా ఉన్నప్పుడు తిరగని ఊరు లేదు .. తిరగని మండలం లేదు..ఎక్కడైనా రైతులు ఇబ్బందులు పడితే.. రైతుల కల్లాల దగ్గరకు వెళ్లవా..పరామర్షించావా..” అంటూ పొన్నం తన స్టైల్లో ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News