రాప్తాడులో మళ్లీ బంపర్ మెజార్టితో గెలవబోతున్నానని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రాప్తాడు నియోజకవర్గంలో ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని ఆయన అన్నారు.
ఉదయం నుంచే మహిళలు ప్రతి బూత్ వద్ద బారులు తీరారు. 9 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభంజనం వీస్తోందనేది అర్థమైందన్నారు. వృద్ధులు, మహిళలు అత్యధిక సంఖ్యలో పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరడం, స్వచ్చందంగా ఓటర్లు ఇళ్ల నుంచి వచ్చి ఓట్లు వేయడం వంటివి గమనిస్తే జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి లేకపోతే తమకు పథకాలు ఇచ్చే దిక్కులేదనే నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోందన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాల్లోని మహిళలు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేశారని తోపుదుర్తి చెప్పటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభంజనం ఎలా కొనసాగిందో రాప్తాడు నియోజకవర్గంలోనూ అలానే కొనసాగిందన్నారు. ఎన్నికలకు ముందు దాదాపు 14 వేల ఓట్లు తొలిగించినా, ఆర్‌ఓలను మార్పించినా, అధికారులను మార్పించినా వీరి ఎత్తులను ప్రజలు చిత్తు చేశారని తోపుదుర్తి అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎంత దుర్మార్గంగా, దారుణంగా వ్యవహరించిందని.. డిలీషన్ తర్వాత తమకు ఉన్న ఓట్లను తొలిగించడంతో కొత్తగా దరఖాస్తు చేసుకుంటే వాటిని చేర్చకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు, బిఎల్‌ఓలకు పెద్ద ఎత్తున డబ్బులు కుమ్మరబోర్చారన్నారు.
పరిటాల సునీత కొడుకు, తమ్ముళ్లు పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారని, రామగిరి మండలం కొండాపురంలో ప్రజలు తిరగబడ్డారని, ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. వైఎస్సార్‌సికి రాప్తాడు నియోజకవర్గం కంచుకోటలా మార్చేస్తామని. రాప్తాడు ప్రజల గళాన్ని మరోమారు అసెంబ్లీలో వినిపించబోతున్నానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.