Tuesday, June 24, 2025
Homeపాలిటిక్స్Renuka Chowdhury: జగన్ పై రేణుకా చౌదరి ఘాటు విమర్శలు

Renuka Chowdhury: జగన్ పై రేణుకా చౌదరి ఘాటు విమర్శలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై(Jagan Mohan Reddy) కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి(Renuka Chowdhury) ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వెధవన్నర వెధవ అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. జగన్ పుట్టగానే విజయమ్మ గొంతు పిసికి చంపాల్సిందని వ్యాఖ్యానించారు. తొలి నుంచి జగన్ అమరావతికి వ్యతిరేకి అని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో ఆడిన డ్రామాలు అందరికి తెలుసున్నారు.

అధికారం పోయినా కూడా అమరావతిపై ఉన్న కక్ష అలాగే కొనసాగుతోందని మండిపడ్డారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్‌లో విషం చిమ్మడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల ఉద్యమానికి అప్పట్లో తాను కూడా మద్దతు తెలిపానని గుర్తుచేశారు. అమరావతి మహిళలను కించపర్చిన జర్నలిస్టు శ్రీనివాసరావు, కృష్ణంరాజును కఠినంగా శిక్షించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు.

కాగా అమరావతిపై చేసిన నీచమైన వ్యాఖ్యలు పట్ల ఏపీ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మహిళలు రాష్ట్రంలోని సాక్షి కార్యాలయాలపై దాడికి దిగారు. ఛానల్ యాజమానులైన జగన్, భారతి రెడ్డి తక్షణమే అమరావతి మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మహిళలను కించపర్చిన సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని ఇవాళ ఉదయం హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. కొద్దిసేపట్లో వైద్య పరీక్షల అనంతరం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు పరారీలో ఉన్న కృష్ణంరాజు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు.




సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News