మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. చూస్తుంటే సీనియర్ నేత జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సర్వం సిద్ధమైనట్టు స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా బీజేపీ వ్యవహారాలపై ఓపన్ గానే విమర్శలు, ట్వీట్లు చేస్తున్న జితేందర్ వైఖరి రోజురోజుకీ పార్టీలో కష్టంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జితేందర్ రెడ్డిపై కాంగ్రెస్ కన్నేసినట్టు స్పష్టమవుతోంది. మంచి ఎన్నికల వ్యూహకర్తగా జితేందర్ రెడ్డి బీజేపీకి రెండు ప్రతిష్ఠాత్మక ఎన్నికల్లో తన సత్తా చాటుకున్నారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశాక, బీజేపీలో చేరి, బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్ లో ఎమ్మెల్యేగా గెలిపించటంలో జితేందర్ రెడ్డి పన్నిన వ్యూహం అద్భుతమైనదిగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయింది. కొంతకాలం టీఆర్ఎస్ లో ఉన్న జితేందర్ రెడ్డి ఆతరువాతి కాలంలో బీజేపీలో చేరి, అక్కడ సరైన గుర్తింపు దక్కక అసంతృప్తితో ఫార్మ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ లోకి జితేందర్ ను తెచ్చే ప్రయత్నాలు గత కొంతకాలంగా తెరవెనుక జోరుగా సాగుతుండగా నేడు ఏకంగా సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ టీం ఆయన్ను కలవటంతో ఇక ఆయన కాంగ్రెస్ లో చేరటమే తరువాయిగా మారిందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
Revanth met Jitender Reddy: కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి?
పొలిటికల్ స్ట్రాటెజిస్టుగా పేరుగాంచిన జితేందర్