Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Revanth Reddy in Assembly on white paper: కుటుంబ తగాదాలను సభలోకి తెస్తున్న...

Revanth Reddy in Assembly on white paper: కుటుంబ తగాదాలను సభలోకి తెస్తున్న బీఆర్ఎస్-రేవంత్ రెడ్డి ఫైర్

ఏకపక్ష నిర్ణయాలు తీసుకోం-రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..

- Advertisement -

పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టాం..

ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేసాం..

అర్హులైన వారికి సంక్షేమం అందించి దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే మా లక్ష్యం

ఆదాయం, అవసరాలకు సంబంధించి రిజర్వు బ్యాంకు వద్ద నుంచి వివరాలు తీసుకున్నాం

బీఆర్ఎస్ కు అధికారం అప్పగించే నాటికి.. రిజర్వ్ బ్యాంకు వద్ద మన నిధుల నిల్వలు సగటున 303 రోజులు ఉండేవి…

బీఆరెస్ అధికారంలోకి వచ్చాక సగటున ఇందులో సగం రోజులు కూడా లేవు…

రోజూ అప్పు కావాలని వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి

కొన్ని వాస్తవాలు కఠోరమైనవి..

శ్వేత పత్రం ఎవరినో కించపరచడానికి… అవమానించడానికి కాదు..

మేం ప్రకటించిన గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదు…

వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం..

ఆర్ధిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిందే ఈ నివేదిక..

మీకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోండి…

రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డి గారి నేను ఫోన్ చేశా..

స్వార్ధ రాజాకీయాల కోసం కాకుండా ప్రజల కోసం మేం ఆలోచిస్తున్నాం..

బీఆరెస్ వారి కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

మా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు..

మా ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటాం..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News