Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Revanth with full of..: కసితో పనిచేస్తున్న రేవంత్

Revanth with full of..: కసితో పనిచేస్తున్న రేవంత్

రేవంత్ ఇమేజ్ మరింత పెరగటం ఖాయం

చావో రేవో తేల్చుకోవాలి, ఎలాగైనా సత్తా చాటాలి, తన స్థానాన్ని పార్టీలో సుస్థిరం చేసుకోవాలి, రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా పట్టు సాధించాలి. ఇది రేవంత్ ముందున్న ఏకైక లక్ష్యం. ఇందుకు అనుగుణంగా ఆయన శ్రమిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని రెండు లేదా ఒక సీటుకు కట్టడి చేసి, అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి, కాంగ్రెస్ అధిష్ఠానానికి బహుమతిగా ఇచ్చి, తన ఇమేజ్ ను జాతీయ స్థాయిలో చాటుకునే పనిలో ఉన్నారు సీఎం రేవంత్.

- Advertisement -

ఇందుకు అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా చేస్తూ, ఎలాగైనా బీఆర్ఎస్, బీజేపీకి చెక్ పెట్టే వ్యూహరచనలు జోరుగా అమలు చేస్తున్నారు. ఓవైపు గేట్లెత్తేశా అంటూ అధికారిక ప్రకటన చేసి, ఓపన్ గా ఆపరేషన్ ఆకర్ష్ చేస్తూ ప్రతిపక్షాలను బలహీనం చేస్తూ, ఆ లీడర్లు, క్యాడర్ ను గుంజేసుకుంటున్నారు.

మరోవైపు దూకుడుగా ప్రచారం చేస్తూ, చేయిస్తూ, ప్రత్యర్థి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా తన సర్వ శక్తులనూ ఒడ్డుతున్న రేవంత్ ను చూసి ఇటు కేసీఆర్, అటు బీజేపీ షాక్ అవుతోందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. రేవంత్ దూకుడు ఇలాగే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినా చేయచ్చని అప్పుడే రాజకీయ పండితులు విశ్లేషణలు చేసేస్తున్నారు. పలు కేసులతో గులాబీ నేతలకు తీరిక లేకపోగా, తెలంగాణ బీజేపీ నీరసంగా ఉంది. దీంతో రేవంత్ మరింత విజృంభిస్తున్నారు.

పార్టీ లోక్ సభ అభ్యర్థులు, ఇంఛార్జులతో నోవాటెల్ హోటల్ లో భేటీ అయిన జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీలతో కలిసి రేవంత్ కాంగ్రెస్ దండును ఉరికెత్తిస్తున్నారని గాంధీభవన్ లో టాక్.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారందరినీ సమన్వయం చేసుకుంటూ రేవంత్ తన ఇమేజ్ ను రోజురోజుకూ పెంచుకోవటం నిజంగానే రాష్ట్ర ప్రజలను బాగా ఆకట్టుకుంటోంది. రేయింబవళ్లు ప్రజల మధ్య ఉండే సీఎంను తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటిసారి చూస్తోంది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను రెండూ సమన్వయం చేసుకుంటూ, మరోవైపు ఇంట్లో కూడా రేవంత్ అందరికీ అందుబాటులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా చాలక సొంత నియోజకవర్గం, మరోవైపు జిల్లాల పర్యటనలతో ఆయన ఎప్పుడూ ప్రజల మధ్య ఉండటాన్ని చూస్తూ సీఎం అంటే ఇలా ఉండాలనే ఫీలింగ్ లో సామాన్యులుండటం కొసమెరుపు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News