Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Roja in Jagananna Vidya Deewena: వైఎస్ జగన్ వన్స్ మోర్

Roja in Jagananna Vidya Deewena: వైఎస్ జగన్ వన్స్ మోర్

రీల్ హీరో కావాలా? రియల్ హీరో కావాలా?

చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి జగన్ హాజరవ్వగా, భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రోజా చేసిన ప్రసంగం హైలైట్ గా నిలిచింది. తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ..ఆద్యంతం రోజా ప్రసంగం అందరినీ కట్టిపడేసింది,

- Advertisement -

పవన్, చంద్రబాబుకు విద్య కానుక ఇవ్వాలంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.  జగనన్న విద్యా దీవెనతో బాబు, పవన్ కు మంచి చదువు చెప్పించాలన్నారు రోజా.  నగరికి వచ్చిన సీఎం జగన్ పర్యటనతో అత్యంత సంతోషం వ్యక్తంచేసిన రోజా, జగన్ చేతికి రాఖీ కట్టారు.  వైఎస్ జగన్ వన్స్ మోర్ అన్న రోజా, జగన్ను ఓడించే వాడు ఇంకా పుట్టలేదన్నారు.  ప్రజలకు రీల్ హీరో కావాలా రియల్ హీరో కావాలా అంటూ ప్రశ్నించిన ఆమె.. వారెంటీ లేని చంద్రబాబు ష్యూరిటీ ఇస్తే గ్యారెంటీ ఉంటుందా అని సభలో వేసిన ప్రశ్న సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News